పితృదేవోభవ.తండ్రికి ఎంత కష్టం..* *బిడ్డ కోసం తపన.వైరల్ వీడియో..*

 *పితృదేవోభవ.తండ్రికి ఎంత కష్టం..* 


*బిడ్డ కోసం తపన.వైరల్ వీడియో..*


కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది. 


తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి

విభాగంలో చేర్పించారు. 


నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. 


దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు. 


నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా.. సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకొని

ఆమె వెంట వెళ్లారు. 


ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. 


వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం

వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. 


ఇక నుంచి బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow