పవర్ స్టార్ సునామీ.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన లీడ్..

 

Pawan Kalyan: పవర్ స్టార్ సునామీ.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన లీడ్..

ఈ ఎన్నికల్లో పవర్ సునామీ నడుస్తోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇది పవన్‌కు మాములు కమ్ బ్యాక్ కాదు..

Pawan Kalyan: పవర్ స్టార్ సునామీ.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన లీడ్..
Pawan Kalyan
















ఏపీలో జనసేన జోరు చూపిస్తుంది. పవర్ స్టార్ సునామీ నడుస్తోంది. కూటమి క్లియర్ కట్ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు ముందజలో ఉన్నారు. అవును పోటీ చేసిన 21 చోట్ల.. జనసేన లీడ్‌లో ఉన్నట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి.  కాగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో 19 వేలకు పైచిలుకు మెజార్టీతో ముందుకు సాగుతున్నారు.

పవన్‌కు ఇది మామలు కమ్ బ్యాక్ కాదు. 2019 ఎన్నికల్లో  జనసేన కేవలం ఒకే ఒక్క చోట గెలిచింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయినా.. పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుగా సాగిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో తన పవరేంటో చూపించారు.

  • అజయ్ రాయ్ పై 619 ఓట్లతో ముందంజ
  • రౌండ్ రౌండ్ కూ మారుతున్న ట్రెండ్
  • మోదీకి గట్టి పోటీనిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి

ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన లోక్ సభ నియోజకవర్గం వారణాసిలో హోరాహోరీ కొనసాగుతోంది. ఓ దశలో ప్రధాని మోదీ వెనుకబడ్డారు. తాజాగా ఆయన మళ్లీ లీడ్ లోకి వచ్చారు. రెండో రౌండ్ లో వెనుకబడ్డ మోదీ.. మూడో రౌండ్ కు వచ్చేసరికి పుంజుకున్నారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కన్నా 619 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ప్రధాని మోదీకి ఇప్పటి వరకు పోలైన ఓట్లు 36,424 కాగా, ఆయన ప్రత్యర్థి అజయ్ రాయ్ కి 35,805 ఓట్లు పోలయ్యాయి. ఆధిక్యం స్వల్పంగానే ఉండడంతో బీజేపీ వర్గాల్లో ఆందోళన నెలకొనగా.. కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow