ప్రభుత్వ పథకాలు, పాలసీల ద్వారా ప్రజలకు మేలు జరిగే విషయంలో జిల్లా కలెక్టర్లది కీలక పాత్ర ఉందని, సీఎం రేవంత్ రెడ్డి వారికి ఫుల్ పవర్స్ ఇచ్చారని మంత్రి సీతక్క అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో అయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరాలు, పీహె చ్సీని ప్రారంభించారు. అనంతరం కొత్తగా బా ధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ పాలక వర్గం సన్మానంలో ఆమె మాట్లాడారు.
కలెక్టర్లకు జిల్లా లోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఫుల్ పవర్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారని, అధికార ప్రతిపక్షం ప్రజా ప్రతినిధులు, నాయకులు అన వసరంగా ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు మేలు జరిగేలా పనులు చేయాలని సూచించారు. కొత్త పోడు భూములను కొట్టే ఆలోచన అసలే వద్దని, పాత పోడు భూములను వదలవద్దనీ సూచించారు. తాము రాజకీయాలు పక్కన బెట్టి ప్రజలకు మేలు కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు.
from V6 Velugu https://ift.tt/mu1k0sq
via IFTTT