మోసంలో కొత్త విధానం!తప్పు ఎవరిది తిప్పలు ఎవరికి

jayyapal jvs media
1 minute read

 తప్ప ఎవరిది... తిప్పలు ఎవరికి...

సునాయసంఘ పనులు జరిగిపోవాలని ఫోన్ పే గూగుల్ పే వాడుతున్నాం. కానీ చోరశికామణిలకు ఇప్పుడు ఇది ఒక వరంలా మారింది. 




ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తున్నారు కదా వీడియోలు కౌంటర్ లో ఒక అతను క్యాష్ తీసి వచ్చిన వేరే అతనికి ఇస్తున్నాడు ఇది ఎందుకు ఏమిటి ఎలా అనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. 

కార్తీక్ అనే ఒక చిరు వ్యాపారి కూరగాయలు కొనుక్కునే నిమిత్తం బాదేపల్లి లోని గంజికి వెళ్ళాడు అక్కడికి వెళ్లాక తన చరవాణి ఫోను పెయింట్ జేబులో పెట్టుకొని కూరగాయల కొనే పనిలో నిమగ్నం అయిపోగా , బాగా మాటు వేసుకొని ఉన్న ఒక దొంగ ఫోను తస్కరించి వెంటనే అక్కడి నుంచి జారుకొని సింగల్ గడ్డ సత్తూరు కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విఎన్ఆర్ చికెన్ సెంటర్ కు వెళ్లాడు వెళ్లి అన్న నేను గూగుల్ పే చేస్తా క్యాష్ ఇస్తావా అని అడిగాడు దానికి ఓకే అన్న చికెన్ సెంటర్లో పనిచేసే వ్యక్తి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే డబ్బులు వచ్చాయి అని చూసుకొని అతన్ని కల్వకుర్తి రోడ్ లో ఉన్న మరో షాపు పంపించి అక్కడ డబ్బులు ఇచ్చాడు ఇక్కడికి శీను బాగానే ఉంది 

అయితే ఒకసారి 50,000 ఒకసారి 10000 ఒకసారి 10000 ఒకసారి 5000 చొప్పున నాలుగు విడతలుగా కార్తీక్ ఫోన్ నుండి దొంగ పైసలను విఎన్ఆర్ చికెన్ సెంటర్ వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించగా వాళ్ళు ఇతనికి నగదు డబ్బు ఇచ్చి పంపించేశారు. 

ఇప్పుడు డబ్బులు తీసుకుపోయిన దొంగ బాగానే ఉన్నాడు కానీ ఫోను పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకున్న కార్తీక్ డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయిన వీఎన్నార్ చికెన్ సెంటర్ నిర్వాహకులు. 

ఎలా డబ్బులు ఇచ్చారు అని నిలదీయడానికి వెళ్లిన కార్తీక్ ను ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకులు ఎదురుదాడికి దిగారు వచ్చాడు ఫోన్ క్యూఆర్ కోడ్ చేశాడు మాకు ఎటువంటి అనుమానం రాలేదు. మేము డబ్బులు ఇచ్చేశాం. మేము రోజుకి ఇలాగే కొన్ని లక్షల్లో ఎవరికి కావాల్సిన వాళ్లకు డబ్బులు ఇస్తుంటాము అని చెప్పారు. 

ఇప్పుడు విషయం ఏంటంటే ఏ చిన్న మొబైల్ షాప్ వాళ్ళయినా కంప్యూటర్ షాప్ వాళ్లైనా ఇంటర్నెట్ షాపు వలన ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చేసే వాళ్ళ వివరాలు నమోదు చేసుకుంటారు కానీ పిఎన్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకులు ఎలాంటి ఆధారాలు తీసుకోకుండా డబ్బులు పంపించడంతో ఇప్పుడు లబోదిబో అనడం వీఎన్నార్ చికెన్ సెంటర్ వాళ్ళ వంతు అయింది..

చిలికి చిలికి ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది చూడాలి మరి డబ్బులు పోగొట్టుకున్న కార్తిక్ న్యాయం జరుగుతుందా? లేదంటే విఎన్ఆర్ చికెన్ వాళ్లు డబ్బులు ఇచ్చిన పాపానికి కార్తీక్కు డబ్బులు కట్టిస్తారా ఇద్దరు కలిసి దొంగను పట్టుకుంటారా ఇప్పుడు పోలీసుల చేతుల్లోనే సమస్యకు ఒక ఉపాయం దొరుకుతుందేమో చూడాలి


Tags
Chat