వారణాసిలో ప్రధాని మోదీ ముందంజ.

 

వారణాసిలో ప్రధాని మోదీ ముందంజ.. ఇండియా కూటమి ఎన్ని స్థానాల్లో లీడ్‌లో ఉందంటే..


Telangana Lok Sabha Election Results 2024 LIVE Counting and Updates in Telugu: లోక్‌సభ ఎన్నికల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది.. దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.. ఫలితాలు కూడా వెనువెంటనే విడుదల కానున్నాయి. లోక్‌సభతోపాటు.. ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మొదటగా బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. ఆ వెంటనే 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు కొనసాగుతుంది.

IVE NEWS & UPDATES
04 Jun 2024 10:13 AM (IST)
ఒడిశాలో బీజేపీ సత్తా..
ఒడిశాలో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది.. 147 స్థానాలు ఉండగా.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ దూసుకెళ్తోంది..

బీజేపీ 33
బీజేడీ 14
కాంగ్రెస్ 5
ఇతరులు 1
04 Jun 2024 10:07 AM (IST)
తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
ఎనిమిది స్థానాల్లో బీజేపీ ముందంజ
ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం
చెరో స్థానంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం
మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌..నిజామాబాద్, ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం
నల్గొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్‌, పెద్దపల్లి.. మహబూబాబాద్, వరంగల్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం
హైదరాబాద్‌లో ఎంఐఎం, మెదక్‌లో బీఆర్‌ఎస్‌ లీడ్

04 Jun 2024 10:02 AM (IST)
ప్రధాని మోదీ ముందంజ
వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ మోదీపై లీడింగ్‌లో ఉండగా.. తరవ్ాత లీడ్ లోకి వచ్చారు. ప్రస్తుతం 436 ఓట్ల లీడ్ తో మోదీ ముందంజలో ఉన్నారు.

04 Jun 2024 09:53 AM (IST)
అనూహ్య పరిణామం..
లోక్‌సభ ట్రెండ్స్‌లో ఎన్డీయే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటింది. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. ఆరువేల పైలుకు ఓట్లతో మోదీ వెనుకంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ మోదీపై లీడింగ్‌లో ఉన్నారు. వయనాడ్, రాయబరేలిలో రాహుల్‌గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

04 Jun 2024 09:45 AM (IST)
లోక్‌సభ ట్రెండ్స్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే
లోక్‌సభ ట్రెండ్స్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే
వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ
ఆరువేల పైలుకు ఓట్లతో మోదీ వెనుకంజ
మోదీపై లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌
వయనాడ్, రాయబరేలిలో రాహుల్‌గాంధీ ఆధిక్యం
కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి వెనుకంజ

04 Jun 2024 09:43 AM (IST)
వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ
వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ
6223 ఓట్ల వెనుకంజలో ప్రధాని మోదీ
మోదీపై కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ ఆధిక్యం
04 Jun 2024 09:42 AM (IST)
బెంగాల్‌లో బీజేపీ ముందంజ..
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 21 స్థానాల్లో, టీఎంసీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ 2 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 

04 Jun 2024 09:40 AM (IST)
ఢిల్లీలో హోరాహోరీ పోటీ
ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. ఎన్డీయే 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

04 Jun 2024 09:39 AM (IST)
ప్రస్తుత ట్రెండ్స్ ఇవే..
ఎన్డీయే మెజారిటీ మార్క్ దిశగా దూసుకెళ్తోంది.. ఎన్డీఏ 275 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమి 201 సీట్లలో లీడ్ లో ఉన్నాయి.

04 Jun 2024 09:34 AM (IST)
యూపీలో పెను సంచలనం
యూపీలో లోక్ సభ ఫలితాలు సంచలనంగా మారుతున్నాయి. ఎస్పీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.. ఎస్పీ.. బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది.. ఎస్పీ 32 స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

04 Jun 2024 09:28 AM (IST)
అవినాష్ రెడ్డి వెనుకంజ..
కడపలో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి వెనుకంజ..

04 Jun 2024 09:25 AM (IST)
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుండటంతో.. దేశీ స్టాక్ మార్కెట్లు దెబ్బకు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1900 పాయింట్లు నష్టపోయి.. కొనసాగుతుండగా.. నిఫ్టీ 600 పాయింట్లు నష్టపోయాయి.

04 Jun 2024 09:24 AM (IST)
కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
600 పాయింట్ల నష్టంలో నిఫ్టీ
2 వేల పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌
04 Jun 2024 09:18 AM (IST)
ఏపీలో ముందంజలో ఉన్నది వీరే..
నెల్లూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ముందంజ
విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చిన్ని ఆధిక్యం
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు లీడ్
నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆధిక్యం
రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి ఆధిక్యం
తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యం
కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యం
హిందూపురంలో టీడీపీ అభ్యర్థి పార్థసారథి ఆధిక్యం
అనంతపురంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ లీడ్
04 Jun 2024 09:15 AM (IST)
పులివెందులలో సీఎం జగన్‌ ఆధిక్యం
పులివెందులలో సీఎం జగన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్‌లో 1888 ఓట్ల ఆధిక్యం..

04 Jun 2024 09:12 AM (IST)
ఒడిశాలో..
ఒడిశాలో బీజేపీ 5,
బీజేడీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
04 Jun 2024 09:03 AM (IST)
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఆధిక్యం..
మహబూబాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ముందంజలో ఉన్నారు.

04 Jun 2024 09:03 AM (IST)
Nizamabad Election Result: నిజామాబాద్‌లో బీజేపీ ముందంజ
నిజామాబాద్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బిజెపి అభ్యర్థి అరవింద్ ముందంజలో ఉన్నారు.

04 Jun 2024 09:02 AM (IST)
అమిత్ షా ముందంజ
లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్ ముందంజలో ఉన్నారు
ఘజియాబాద్ నుంచి బీజేపీ ముందంజలో ఉంది
గోరఖ్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్‌ ఆధిక్యంలో ఉన్నారు.
గాంధీనగర్ నుంచి అమిత్ షా ముందంజలో ఉన్నారు
04 Jun 2024 09:01 AM (IST)
భువనగిరిలో బీజేపీ ఆధిక్యం
భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందంజలో కొనసాగుతున్నారు

04 Jun 2024 08:58 AM (IST)
Warangal Election Result: వరంగల్ లో బీజేపీ ఆధిక్యం
వరంగల్ లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ముందంజలో కొనసాగుతున్నారు.

04 Jun 2024 08:57 AM (IST)
Vijayawada Lok Sabha Election Result: విజయవాడలో టీడీపీ ఆధిక్యం
విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి చిన్ని ఆధిక్యంలో కొనసాగుతున్నారు

04 Jun 2024 08:57 AM (IST)
నెల్లూరులో టీడీపీ ఆధిక్యం
నెల్లూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు

04 Jun 2024 08:55 AM (IST)
దూసుకుపోతున్న ఎన్డీఏ.. 369 సీట్లలో ఆధిక్యం
ఎన్డీయే మెజారిటీ మార్కుకు చేరువైంది. 369 సీట్లలో తొలి ట్రెండ్స్ వెలువడ్డాయి. ఎన్డీయే 241 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి  95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 33 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.

04 Jun 2024 08:53 AM (IST)
Nellore Election Result: నెల్లూరులో టీడీపీ ఆధిక్యం
నెల్లూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి లీడ్ ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో విజయసాయిరెడ్డి వెనుకబడ్డారు.

04 Jun 2024 08:51 AM (IST)
Pawan Kalyan Election Result: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఆధిక్యం..
పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

04 Jun 2024 08:50 AM (IST)
Asaduddin Owaisi Election Result: అసదుద్దీన్ ఒవైసీ ముందంజ
హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో ఉన్నారు.

04 Jun 2024 08:44 AM (IST)
పెద్దపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం
పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ లీడింగ్‌ ఉన్నారు. వంశీకృష్ణకు తొలిరౌండ్‌లో 816 ఓట్ల ఆధిక్యం లభించింది.

04 Jun 2024 08:43 AM (IST)
రాజమండ్రిలో బీజేపీ.. నరసరావుపేటలో టీడీపీ ఆధిక్యం
రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి లీడ్‌‌లో ఉన్నారు. 617 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

నరసరావుపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు లీడ్‌లో ఉన్నారు.

04 Jun 2024 08:39 AM (IST)
Etela Rajender Election Result: ఈటల రాజేందర్‌కి 6330 ఓట్ల ఆధిక్యం
మల్కాజ్‌గిర్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కి 6330 ఓట్లతో ఆధిక్యం
ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో..
బీజేపీ :-8811 ఓట్లు
కాంగ్రెస్ :2581 ఓట్లు
బిఆర్ఎస్ :1418 ఓట్లు
04 Jun 2024 08:37 AM (IST)
Malkajgiri Lok Sabha Election Result: మల్కాజ్‌గిరిలో బీజేపీ ఆధిక్యం
మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

04 Jun 2024 08:32 AM (IST)
Adilabad Lok Sabha Election Result: ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం
ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి నగేష్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ లీడ్ లో ఉంది.
04 Jun 2024 08:30 AM (IST)
Khammam Lok Sabha Election Result : ఖమ్మంలో కాంగ్రెస్ ఆధిక్యం
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

04 Jun 2024 08:29 AM (IST)
Karimnagar Election Result: కరీంనగర్‌లో బండి సంజయ్ ముందంజ
కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజ
ఆధిక్యంలో బండి సంజయ్‌
పోస్టల్‌ బ్యాలెట్‌లో బండికి మెజారిటీ ఓట్లు
04 Jun 2024 08:28 AM (IST)
శశిథరూర్‌ వెనుకంజ..
విదిశ నుంచి బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు
భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థి అలోక్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు
ఇండోర్ నుంచి బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ ఆధిక్యంలో ఉన్నారు
ఖజురహో నుంచి బీజేపీ అభ్యర్థి వీడీ శర్మ ఆధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌ తొలి ట్రెండ్‌లో వెనుకబడ్డారు
ఇప్పటివరకు, 93 స్థానాలకు ట్రెండ్‌లు వచ్చాయి, వీటిలో NDA 61 స్థానాల్లో, ఇండి కూటమి 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

04 Jun 2024 08:25 AM (IST)
స్మృతి ఇరానీ ఆధిక్యం
అమేథీ లోక్ సభ నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు.

04 Jun 2024 08:23 AM (IST)
54 సీట్లలో ట్రెండ్స్ ఇవే..
ఇప్పటి వరకు 54 సీట్లకు ట్రెండ్స్ వచ్చాయి. ఎన్డీయే 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరుల ఖాతాలో 1 సీటు ఉంది. నాగ్‌పూర్ నుంచి నితిన్ గడ్కరీ ముందంజలో ఉన్నారు. రాయ్‌బరేలీ, వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. భిల్వారా నుంచి సీపీ జోషి ఆధిక్యంలో ఉన్నారు.

04 Jun 2024 08:21 AM (IST)
Rahul Gandhi Lok Sabha Election Result: రెండు నియోజకవర్గాల్లో రాహుల్‌ గాంధీ ఆధిక్యం..
వయనాడ్, రాయబరేలిలో రాహుల్‌ గాంధీ ఆధిక్యం..
ఢిల్లీలో ఏడు సీట్లలో బీజేపీ లీడింగ్
అసన్‌సోల్‌లో శత్రుఘ్నసిన్హా ఆధిక్యం
నాగ్‌పూర్‌లో ఆధిక్యంలో నితిన్‌ గడ్కరీ
04 Jun 2024 08:19 AM (IST)
PM Modi Lok Sabha Election Result: వారణాసిలో మోదీ.. రాయ్‌బరేలిలో రాహుల్ ఆధిక్యం
వారణాసిలో నరేంద్రమోదీ ఆధిక్యం
మండిలో కంగనా రనౌత్ ఆధిక్యం
రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ లీడింగ్
కోయంబత్తూరులో బీజేపీ అన్నామలై లీడింగ్‌
యూపీలోని మైన్‌పురిలో అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ లీడింగ్‌
బెంగాల్‌లోని డైమండ్‌ హార్బర్‌ సెగ్మెంట్‌ నుంచి.. మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్‌ బెనర్జీ లీడింగ్‌
04 Jun 2024 08:14 AM (IST)
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ క్రమంలో మొదటి ట్రెండ్స్ కూడా వెలువడుతున్నాయి. ఎన్డీయే 46సీట్లు, ఇండి కూటమి 21 సీట్ల ఆధిక్యంలో ఉన్నాయి..

04 Jun 2024 08:10 AM (IST)
లోక్‌సభ ట్రెండ్స్‌లో లీడ్‌లో ఎన్డీయే కూటమి
లోక్‌సభ ట్రెండ్స్‌లో లీడ్‌లో ఎన్డీయే కూటమి
కోయంబత్తూరులో బీజేపీ లీడింగ్‌
గుజరాత్‌లోని ఆనంద్‌ సెగ్మెంట్‌లో కాషాయం ఆధిక్యం
యూపీలోని మైన్‌పురిలో అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ లీడింగ్‌
బెంగాల్‌లోని డైమండ్‌ హార్బర్‌ సెగ్మెంట్‌ నుంచి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్‌ బెనర్జీ లీడింగ్‌
04 Jun 2024 08:06 AM (IST)
జడ్జిమెంట్‌ డే.. ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయం
మొదలైన ఓట్ల లెక్కింపు
ఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయం
రెడ్‌జోన్‌లుగా కౌంటింగ్‌ కేంద్రాలు
కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత
ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఉ.8:30కి ఈవీఎంల ఓట్లు లెక్కింపు ప్రారంభం
04 Jun 2024 08:01 AM (IST)
ప్రారంభమైన కౌంటింగ్
దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ మొదలైంది..

04 Jun 2024 07:45 AM (IST)
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ..
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. దీనిలో సూరత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఒకవైపు అధికార పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, మరోవైపు కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఇండి కూటమిగా పోటీచేస్తున్నాయి. 

04 Jun 2024 07:36 AM (IST)
కొవ్వూరు, నరసాపురంలో తొలి ఫలితం
ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు
కొవ్వూరు, నరసాపురంలో తొలి ఫలితం
13 రౌండ్లలోనే తేలనున్న కొవ్వూరు, నరసాపురం ఫలితం
ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు
భీమిలి, పాణ్యంలో 26 రౌండ్లు పట్టనున్న ఓట్ల లెక్కింపు
ఎంపీ స్థానాల్లో మొదట రాజమండ్రి, నరసాపురం ఫలితాలు
ఆఖరుగా వెలువడనున్న అమలాపురం ఎంపీ ఫలితం
అమలాపురం స్థానంలో అత్యధికంగా 27 రౌండ్లు లెక్కింపు
04 Jun 2024 07:32 AM (IST)
మోదీ చరిత్ర సృష్టిస్తారా?
ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత, ప్రధాని మోడీ.. దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గురించి తీవ్ర చర్చ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ లాగా ఫలితాలు వస్తే, ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు.. అంతేకాకుండా.. నెహ్రూ స్థాయికి తగ్గట్టుగా కొత్త చరిత్ర సృష్టిస్తారనని చర్చ జరుగుతోంది.. ఇంతకు ముందు జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే ఇలా చేసిన రికార్డు ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ 1947 నుండి 1964 వరకు మొత్తం 4 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా మూడుసార్లు ప్రధానమంత్రులుగా ఉన్నప్పటికీ, వారి పదవీకాలం పూర్తిగా కొనసాగలేదు. ఇదొక్కటే కాదు, ఎగ్జిట్ పోల్స్ లాగా ఫలితాలు వస్తే, వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయిన మొదటి కాంగ్రెసేతర నాయకుడు నరేంద్ర మోడీ అవుతారు.

04 Jun 2024 07:29 AM (IST)
దేశవ్యాప్తంగా ఉత్కంఠ
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది సేపట్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే.. అలనాటి చరిత్రను తిరగరాసి.. నరేంద్రమోడీ మూడోసారి అఖండ విజయం సాధించబోతున్నారా? కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యల అంచనా ఏంటి..? లోక్‌సభ ఎన్నికల వాస్తవ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు పూర్తి విరుద్ధంగా ఉంటాయా..? అనేది మరికాసేపట్లో తెరపడనుంది..

04 Jun 2024 07:20 AM (IST)
బీజేపీ ఖాతాలో సూరత్..
సూరత్ సీటు బీజేపీ ఖాతాలో..
ట్రెండ్స్ రాకముందే ఎన్డీయే ఒక సీటు గెలుచుకుంది. గుజరాత్‌లోని సూరత్‌ లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.. మిగతా 542 స్థానాల్లో మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.

04 Jun 2024 07:13 AM (IST)
తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో..
తెలంగాణ‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాల కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. హోరాహోరీగా సాగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు మరికొద్దీ గంటల్లో వెలువడనున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలకు ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొద‌లవుతోంది.


నరాలుతెగే ఉత్కంఠకు మరికాసేపట్లో తెర
నరాలుతెగే ఉత్కంఠకు మరికాసేపట్లో తెర
మరో గంటలో ప్రారంభంకానున్న కౌంటింగ్‌
8గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌, 8:30కి EVM ఓట్ల లెక్కింపు
ఈవీఎంల్లో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాలు
ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల ఓట్ల లెక్కింపు
మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టత
కొవ్వూరు, నరసాపురంలో తొలి ఫలితం
13 రౌండ్లలోనే తేలనున్న కొవ్వూరు, నరసాపురం ఫలితం
ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు
భీమిలి, పాణ్యంలో 26 రౌండ్లు పట్టనున్న ఓట్ల లెక్కింపు
ఎంపీ స్థానాల్లో మొదట రాజమండ్రి, నరసాపురం ఫలితాలు
ఆఖరుగా వెలువడనున్న అమలాపురం ఎంపీ ఫలితం
అమలాపురం స్థానంలో అత్యధికంగా 27 రౌండ్లు లెక్కింపు
04 Jun 2024 06:51 AM (IST)
సార్వత్రిక సమరం.. కాసేపట్లో ఓట్ల లెక్కింపు
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమయ్యింది. సూరత్ లోక్‌సభ నియోజకవర్గాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 542 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. అటు ఏపీ అసెంబ్లీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఉ.8 గం.లకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు చేపడుతారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 8.30 గం.ల నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఏదైనా నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేనిపక్షంలో ఉదయం 8 గం.ల నుంచే ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.

04 Jun 2024 06:45 AM (IST)
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు: కాసేపట్లో మొదలుకానున్న కౌంటింగ్
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. తెలంగాణలో మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 120 హాళ్లలో 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు.. 9 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. తెలంగాణలో కౌంటింగ్ విధుల్లో 10 వేల మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు.

03 Jun 2024 09:30 PM (IST)
లోక్‌సభ కౌంటింగ్‌
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యింది. కౌంటింగ్‌ను చాలా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈవిషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు సీఈసీ రాజీవ్‌కుమార్‌.

03 Jun 2024 09:05 PM (IST)
ఉత్కంఠకు తెర పడనుంది
ఏపీలో మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెర పడనుంది. వేలాది పోలీసు బలగాల పహారా మధ్య, సీసీ కెమెరాల నిఘా నీడలో... అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌కు తెర లేవనుంది. పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసను దృష్టిలో పెట్టుకుని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

03 Jun 2024 07:44 PM (IST)
భారీ భద్రత
మరి కొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

03 Jun 2024 06:30 PM (IST)
ఎంపీ అభ్యర్థితో పాటు నలుగురిని కౌంటింగ్ సెంటర్లోకి..
రామ్ రెడ్డి ఎడ్యుకేషన్ ఫర్ డిస్టెన్స్ కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లను రిటర్నింగ్‌ అధికారి హేమంత్‌ కేశవ పాటిల్ పరిశీలించారు. సెంటర్ల ఏర్పాట్లపై ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు మధ్యాహ్నం 12 లోపల వచ్చే అవకాశం ఉందన్నారు. గెలుపొందిన ఎంపీ అభ్యర్థితో పాటు నలుగురిని కౌంటింగ్ సెంటర్లోకి అనుమతిస్తామన్నారు. ఎన్నికల నిర్బంధాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

03 Jun 2024 05:41 PM (IST)
సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఫలితం
సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఫలితాలు మధ్యాహ్నం మూడు లోపల వచ్చే అవకాశం ఉందని టీవీ9 తో రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ ఐఏఎస్ అన్నారు.

03 Jun 2024 04:30 PM (IST)
NDA - INDIA: ఇండియా కూటమిలో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్..
ఎన్నికల ఫలితాలకు ముందు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నేతల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కేంద్రంలో మోదీ సర్కార్ 3.0 ఖాయమంటూ పేర్కొన్నాయి.. అయితే.. కాంగ్రెస్ కూటమి (ఇండి కూటమి) తక్కువ సీట్లకే పరిమితమవుతుందని పేర్కొన్నాయి. దీంతో ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపై బీజేపీ నేతలు సంబరపడుతుంటే.. ఇండియా కూటమి నేతలు మాత్రం.. అసలు పల్స్‌ వేరే ఉంటుంది.. వెయిట్ చేయండి అంటూ సమాధానమిస్తున్నాయి.

Telangana Lok Sabha Election Results 2024 LIVE Counting and Updates in Telugu: లోక్‌సభ ఎన్నికల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది.. దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.. ఫలితాలు కూడా వెనువెంటనే విడుదల కానున్నాయి. లోక్‌సభతోపాటు.. ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మొదటగా బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. ఆ వెంటనే 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు కొనసాగుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ లేనిచోట 8గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 543 లోక్‌సభ స్థానాల్లో.. ఇప్పటికే సూరత్‌ నియోజకవర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. 542 స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. భారీగా బలగాలను మోహరించడంతోపాటు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే, దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల పహరాలో కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి వరకు కొనసాగనుంది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపు, ఓటముల ప్రకటన తర్వాత ఎన్నికల అధికారులు సర్టిఫికెట్లను అందజేస్తారు.. కాగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండి కూటమి మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే.. ఎగ్జిట్‌ పోల్స్‌ మొత్తం మళ్లీ మోదీ 3.0 సర్కార్‌ వస్తుందని చెప్పిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ..
ఆంధ్రప్రదేశ్‌లో సైతం లోక్‌సభ ఎన్నికలతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌... 8.30కి EVMలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ లేనిచోట 8 గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏపీలో జగన్‌ నేతృత్వంలోని వైసీపీ, ఎన్టీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మధ్య తీవ్ర పోటీ ఉంది.

అలాగే.. ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఇక్కడ, బీజేపీ, బీజేడీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

అయితే, ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమై 11 గంటల వరకు ట్రెండ్స్‌ వెలువడనున్నాయి. అలాగే.. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటలోపు ఫలితాలపై ఓ అంచనా వస్తుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow