తల్లి, కూతుళ్లను చిదిమేసిన లారీ..! గాయాలతో బయటపడిన తండ్రి, కొడుకులు

 *తాండూరు లో లారీ భీభత్సం-ఇద్ధరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయలు*



తల్లి, కూతుళ్లను చిదిమేసిన లారీ..!          

గాయాలతో బయటపడిన తండ్రి, కొడుకులు


అంతకుముందే మరో బైకును డీకొట్టిన లారీ..బైకర్ కి తీవ్ర గాయలు                                                   


వికారాబాద్ జిల్లా : తాండూరు వేగంలో ఉన్న లారీ భైకును ఢీకొట్టి తల్లీ, కూతుళ్లను చిదిమేసింది. తృటిలో తండ్రీ కుమారులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ అంతకుముందే మరో బైకును ఢీకొట్టింది. ఈ ఘోరమైన సంఘటన బుధవారం సాయంత్రం తాండూరు కాగ్నానది శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే… బంటారం మండలం సల్‌బత్తాపూర్ గ్రామానికి చెందిన కోస్గి నర్సింలు తన భార్య అనిత(25), కూతురు చిట్టి(1), కుమారుడుతో కలిసి యాలాల మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రం వద్దకు వెళ్లారు.

సాయంత్రం తిరిగి గ్రామానికి బైకుపై బయల్దేరారు. మార్గమద్యలోని కాగ్నానది బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ బైకును ఢీకొట్టింది. వెనుక బైకుపై ఉన్న తల్లీ అనిత, కూతురు చిట్టి కిందపడిపోయారు. అనిత తలకు తీవ్రగాయాలు కాగా, కూరుతు చిట్టి తలపై నుంచి లారీ చక్రాలు దూసుకెళ్లడంతో చితికిపోయింది. ప్రమాదానికి కారణమైన లారీ అంతకుముదే బాలరాజు, లక్ష్మీ అనే దంపతులు ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్య, కుమార్తెలను కోల్పోయిన నర్సింలు బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లీ, కూతుళ్ల మృతదేహాలను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ విఠల్ రెడ్డి బాధితులను కలిసి జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow