జడ్చర్ల : మేకల మంద వద్ద నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన జడ్చర్ల పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలో కలకలం రేపింది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో గల రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఆంజనేయులు (42) రోజువారీ లాగా తనకున్న మేకలను మేపుకుని.. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తన ఇంటి సమీపంలోనే ఉన్న మేకల మంద వద్ద నిద్రించడానికి వెళ్లారు ఆంజనేయులు. కాగా శనివారం ఉదయం ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆంజనేయులు చిన్న కుమారుడు మేకల మంద వద్దకు వెళ్లి చూడగా ఆంజనేయులు విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని ఆంజనేయులు కుమారుడు తన దళిత పార్టీ గ్రామస్తులకు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆంజనేయులును ఎవరో గుర్తు తెలియని దుండగులు మెడ కోసి దారుణంగా హత్య చేశారని గుర్తించి స్థానిక పోలీస్ సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ ఆదిరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించగా ఘటన స్థలంలో మద్యం బాటిల్లతో పాటు మద్యం సేవించిన గ్లాసులు కారం పొడిని గుర్తించారు.
దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి జిల్లా కేంద్రం నుండి క్లూస్ టీమ్ను రప్పించి ఘటనా స్థలంలో ఆధారాల కొరకు అన్వేషించారు పోలీస్ జాగిలంతో నిందితుల కొరకు అన్వేషించారు. కాగా విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిసరాలను పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడిన డీఎస్పీ ఆంజనేయులు గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో మెడ కోసి కారణంగా హత్య చేశారని మద్యం బాటిల్లు గ్లాసులపై వేలిముద్రలు లభించాయని ఈ ఘటనపై లోతుగా విచారణ చేపడుతున్నామని రెండు మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు. కాగా మృతుడు ఆంజనేయులు ఎంతో సౌమ్యుడని ఎవరి జోలికి పోయేవాడు కాదని నిత్యం మేకల మంద వెంట ఉండే ఆంజనేయులును హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆంజనేయులు హత్య తెలిసిన వారి పనేనా లేక ఏవైనా పాత గొడవలు ఉన్నాయా అని ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.మృతునికి ముగ్గురు కూతుర్లు ఓ కుమారుడు భార్య ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
