PBKS vs CSK: పంజాబ్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. పదోసారి టాస్ ఓడిన చెన్నై

Caption of Image.

ప్లే ఆఫ్స్ సమీపిస్తున్న వేల ఐపీఎల్ మ్యాచ్‌లు హోరాహోరీహ సాగుతున్నాయి. గెలిస్తేనే అడుగు ముందుకు పడే అవకాశం ఉండటంతో విజయం కోసం అన్ని జట్లు శక్తికి మించి పోరాడుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌ జట్లు ప్లే ఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఏడు జట్లు పోటీలో ఉన్నాయి. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబైకి అవకాశాలు ఉన్నప్పటికీ.. అది 0. 06 శాతం మాత్రమే.

ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం(మే 03) డబుల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఐదో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ సారథి సామ్ కరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట చెన్నై బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు 11 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ పదింట టాస్ ఓడటం గమనార్హం.

తుది జట్లు

చెన్నై: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే.

పంజాబ్: జానీ బెయిర్‌స్టో, రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/koFgNsi
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال