New Logo: ఖరారైన తెలంగాణ కొత్త లోగో..!





 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Congress Govt.) కొత్త లోగో (New Logo)ను దాదాపు ఖరారు చేసింది. కాకతీయ తోరణం (Kakatiya Toranam), చార్మినార్ (Charminar) స్థానంలో అమరవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Govt.) అవకాశం కల్పించింది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచారు. ఈ లోగోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మొత్తం 40కిపైగా డిజైన్లను కాంగ్రెస్ సర్కార్ పరిశీలించింది. మరో రెండు రోజుల్లో అవతరణ ఉత్సవాల నేపథ్యంలో ఆ రోజు కొత్త లోగోను ఖారారు చేయనున్నట్లు సమాచారం.


హైదరాబాద్: తెలంగాణ కొత్త లోగో (కొత్త రాజముద్ర) దాదాపు ఖరారయ్యిందని గత 24 గంటలుగా హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో రిలీజ్ అంటూ కాంగ్రెస్ నేతల మాటలు.. ఇక సోషల్ మీడియాలో అయితే ఇదిగో ఇదే ఫైనల్ అని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే.. తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది. తొలుత జూన్- 2 రిలీజ్ చేయాలని భావించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్-02న కాకుండా మరో రోజున రిలీజ్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే.. తెలంగాణ గీతం మాత్రమే జూన్-02నే విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال