ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పై సొంత గ్రామస్తుల ఫిర్యాదు



అక్రమంగా మట్టి తరలించారని జిల్లా కలెక్టర్ రవి నాయక్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు


రాజాపూర్, మేజర్ న్యూస్


జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి,  అతని సోదరుడు దుష్యంత్ రెడ్డి రంగారెడ్డిగూడ గ్రామ శివారులోని భూమి సర్వే నెం. 87, 89, 90, 91 లలో గుర్రాల కోసం అక్రమంగా మూడు మీటర్ల మట్టి నింపడం జరిగిందని ఈ విషయమై బుధవారం రంగారెడ్డి గూడ గ్రామానికి చెందిన పసులాది ప్రశాంత్ రెడ్డి, కర్ణేకోట శ్రీనివాస్, 

రెబ్రమేని శ్రీనివాస్, ఎరుకలి యాదగిరి తదితరులు జిల్లా కలెక్టర్ రవి నాయక్ కు ఫిర్యాదు చేశారు.


ఇట్టి మట్టిని రంగారెడ్డిగూడ శివారులోని సర్వే నెం.361, 362 నుండి ఇష్టా రీతిగా ఇల్లీగల్ మైనింగ్ చేసి నాలుగు నుంచి ఐదు మీటర్ల గుంతలు పెట్టి దాదాపు 15 వేల ట్రిప్పుల మట్టిని తరలించి వారు స్వంత అవసరాలకు వారి ఇంటి వెనుకల పోసుకున్నారని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి మైనింగ్ అధికారులను ఆదేశించి ఇట్టి ఇల్లీగల్ మైనింగ్ పై పూర్తిస్థాయిలో విచారణచేసి మైనింగ్ చట్టం ప్రకారం పెనాల్టీ విధించి ప్రభుత్వానికి చెల్లించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు వారు విజ్ఞప్తి చేశారు. 


సర్వే నెం. 87, 89 లలో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఇల్లీగల్ గా షెడ్లు ఏర్పాటుచేసి నేటి వరకు గ్రామపంచాయతీకి టాక్స్ కూడా చెల్లించడం లేదని, బాలానగర్ గ్రామంలో ఇల్లీగల్ గా మట్టినింపారని మైనింగ్ అధికారులు ఫైన్ వేసిన విధంగా ఈ భూమికి కూడా విచారణ చేసి చర్య తీసుకొనగలరని వారు కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.


 భవిష్యత్తులో ఇల్లీగల్ మైనింగ్ జరగకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి గూడ గ్రామానికి చెందిన పసులాది ప్రశాంత్ రెడ్డి, కర్ణేకోట శ్రీనివాస్, రెబ్రమేని శ్రీనివాస్, ఎరుకలి యాదగిరి తదితరులు జిల్లా కలెక్టర్ రవి నాయక్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me