ముఖ్యమంత్రి పై సీరియస్ అయిన హరీష్ రావు

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్





 అయ్యారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం హరీష్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెప్తే రాష్ట్రానికి పెట్టు బడులు వస్తాయా? అని ప్రశ్నించారు. పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాల కల్పన జరుగుతుందా? అన్నారు. రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గిపోదా? అన్నారు. ఇవాళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్నారు. కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ వాళ్లు ఇక్కడ బతికేవారని.. కానీ ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయిందని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయిందని తెలిపారు. భవిష్యత్తులో కరెంట్ కూడా ఉంటదో ఉండదో కూడా తెలియదని హరీష్ రావు చెప్పుకొచ్చారు.



Previous Post Next Post

نموذج الاتصال