నేడు ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చెప్పటిన నిరసన దీక్ష విజయవంతమైంది.
జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో మాజీ మంత్రి,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు.రైతుల సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు.ఎండిన పంటలకు ఎకరానికి ₹ 25000/- నష్ట పరిహారంతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా
₹ 15000/- రైతుబందు,పంట బోనస్,రుణమాఫీ తదితర హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు,రైతులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భారతీయ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు నిరసన దీక్షలో పాల్గొన్న జడ్చర్ల మాజీ శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి.
కరువు అం
టేనే కాంగ్రెస్ అంటేనే కరువు జడ్చర్లలో EX ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రైతు నిరసన దీక్షలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిర్వహించిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి తో పాటు భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ కళ్లిబుళ్లు కబుర్లు చెప్పి అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మేము కొత్తగా గుంతమ్మ కోరికలు అడగడం లేదు మీరు ఇచ్చిన హామీలను అమలుపరచండని అడుగుతున్నామని అన్నారు.
10 సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో ఒక గుంట పొలం కూడా ఎండిపోలేదు కానీ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో వరి పొలాలన్నీ ఎండిపోతున్నాయని అన్నారు.
ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మొదలయ్యాయి మోటార్ వైండింగ్ షాపులన్నీ బందై నుండి కాంగ్రెస్ రాగానే మోటర్ వైన్డింగ్ షాపులకు గిరాకీ పెరిగింది అన్నారు.
అలాగే టిఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎగ్జామ్లు పెట్టి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం పెళ్లి కాకుండా అని పిల్లలు పుట్టారు అనే చందంగా ఉంది అని అన్నారు.
