సెంటర్ -నాగర్ కర్నూల్ జిల్లా
యాంకర్ పార్ట్ -80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి అధికారం పోయాక మతిభ్రమించినట్టుంది అని జూపల్లి కృష్ణారావు అన్నారు
వాయిస్ ఓవర్ -ఈరోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు,
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయిందని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే వానకాలం అయిపోయింది అది మీ పుణ్యమే కాదా అని జూపల్లి అన్నారు,
కృష్ణానది జలాలని కాపాడుకోలేకపోయారు,
కృష్ణానది జలాలపై హక్కు సాధించకపోగా రాయలసీమ తరలించుకొని పోతుంటే ఏం చేయలేకపోయారు, మేడిగడ్డ బ్యారేజ్ మీరు చేసిన నిర్వాకం వల్ల కుంగిపోవడంతో నీరుని నిలుపుకోలేకపోయామని అన్నారు,
మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం సంబంధించి కూడా 2021-22వ సంవత్సరంలో కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ అప్పటికి రైతులకు పంటలకు నీళ్లు వదలలేదు ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఉరి వేస్తే ఉరి అన్న ఈ కెసిఆర్ రైతుల దగ్గరికి వెళ్లి గిట్టుబాటు ధర అడగడం హాస్యాస్పదం అన్నారు ,కెసిఆర్ ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించి ఏరోజు ప్రగతి భవన్ దాటి బయటికి రాలే, ప్రజల్ని పట్టించుకోలే,కానీ ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికి మాత్రమే ఇప్పుడు రైతుల దగ్గరకు వస్తున్నారు, గడచిన పది సంవత్సరాల కాలంలో రైతులకు వరదల కారణంగా, కరువు కాటకాల కారణంగా ఒక్క రోజైనా మీరు రైతులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చినట్లయితే నేను ఎలాంటి శిక్షకైనా నడి బజార్లో అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ,కేవలం 2023లో మాత్రమే మీరు ఎలక్షన్స్ కోసం మాత్రమే ఒక పర్యాయం ఇచ్చారు... 10 సంవత్సరాలు ఇయ్యని మీరు 2023 ఇవ్వడానికి కారణం కేవలం జనాల ఓట్ల కోసం మాత్రమేనని రైతులపై మీకు ఎలాంటి ప్రేమ లేదని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు...