నా భర్త నాకు కావాలి.. ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్ భార్య ఆందోళన

Caption of Image.

విడాకుల ఇవ్వాలని భర్త వేధిస్తున్నాడని భార్య ఇంటి ముందు ఆందోళనకు దిగింది. వేరే అమ్మాయితో ఉంటూ తనను పట్టించుకోవడం లేదని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. విరాల్లోకి వెళ్తే రంగారెడ్ది జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ లో శ్రీ సాయి పంచవతి హోమ్స్ లో నివాసం ఉంటున్న మెదక్ ఏ ఆర్ డిఎస్పీ రంగా నాయక్ ఇంటి ముందు అతని భార్య జ్యోతి ఆందోళనకు దిగింది. 

వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదనీ జ్యోతి ఆరోపించింది. 2007  రంగనాయకు తనకు పెళ్లైందని  తర్వాత ఇద్దరు అడపడుచులు పెళ్ళీలు కూడ చేశామని తెలిపింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని 2018లో తుర్కయంజాల్ కు వచ్చి నివాసం ఉంటున్నామని తెలిపింది. 2021 నుండి ఇద్దరి మద్య గొడవలు మొదలయ్యాయని  6 నెలల నుండి విడాకులు కావాలని తన  భర్త వేధిస్తు్న్నాడని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. 

తనకు న్యాయం జరగాలంటూ రంగనాయక్ ఇంట్లో ఉన్న సమయంలో ఇంటి ముందు జ్యోతి బందువులతో కలిసి ఆందోళన చేశారు. ఆందోళనలు పెరుగుతుండటంతో ఆదిభట్ల పోలీసులు వచ్చి రంగా నాయక్ ను క స్టేషన్ కు తరలించారు. ఆందోళనలు  చేసే వారిని శాంతింప చేశారు. 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/RG7UDm3
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow