ఆమె కేరాఫ్‌ తీహార్‌ జైలు... నా అడ్రస్‌ రాజ్‌భవన్‌

 



చెన్నై: తనపై విమర్శలు చేస్తున్న డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)పై దక్షిణ చెన్నై బీజేపీ అభ్యర్థి తమిళిసై(BJP candidate Tamilisai) తీవ్రంగా మండిపడ్డారు. కనిమొళి కేరాఫ్‌ తీహార్‌ జైలు అని, కానీ తన చిరునామా రాజ్‌భవన్‌ అని ఎద్దేవా చేశారు. నగరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... 50 ఏళ్ల డీఎంకే పాలనలో సెంట్రల్‌ చెన్నై అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తాను నియోజకవర్గం పూర్తిగా తిరిగి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి అభ్యర్థులు లేక గవర్నర్లు, కేంద్ర మంత్రులను పోటీలో దించారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రజలకు సేవచేయాలని కోరికగా ఉందని ప్రధాని తెలుపడంతో ఆయన అనుమతులతో గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ బలం తెలుస్తుందని తమిళిసై పేర్కొన్నారు

తనపై విమర్శలు చేస్తున్న డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)పై దక్షిణ చెన్నై బీజేపీ అభ్యర్థి తమిళిసై(BJP candidate Tamilisai) తీవ్రంగా మండిపడ్డారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow