మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకొని పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య
రంగారెడ్డి - కొందుర్గు మండలంలోని ఉత్తరాసపల్లికి చెందిన యువకుడు (24)కు.. ఇన్‌స్టాగ్రామ్‌లో బండ్లగూడ జాగీర్ కిస్మత్‌పురకు చెందిన పదోతరగతి చదువుతున్న ఓ బాలిక(16)తో పరిచయమైంది.
బాలిక మైనర్ కావడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోవని గతనెల 27న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు.. తరువాత తన గ్రామానికి ఆ బాలికని తీసుకురాగా, గ్రామస్థులు మైనర్‌ను పెళ్లి చేసుకున్నందుకు పోలీసు కేసు అవుతుందని, ఆ బాలికని వాళ్ల ఇంటి దగ్గర వదిలిపెట్టమని అన్నారు.
దాంతో కేసులకు భయపడి, కలిసి ఉండలేమని భావించి యువకుడు, ఆ బాలిక గతనెల 30న పురుగుల మందు తాగారు.. వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి బాలిక మృతి చెందగా, నిన్న ఉదయం యువకుడు చనిపోయాడు.
