పార్లమెంట్ ఎన్నికలతో‌ ఆ జిల్లాకు‌ మంత్రి‌ పదవి దక్కబోతుందా..?



పార్లమెంట్ ఎన్నికలతో‌ ఆ జిల్లాకు‌ మంత్రి‌ పదవి దక్కబోతుందా..! ఆ వారసుడి రాజకీయ భవిష్యత్ కోసం ఆ ముగ్గురు కీలక నేతల మధ్య ఒప్పందం కుదిరిందా..? నాకంటే నాకే అమాత్య పదవి అంటూ పోటీ పడ్డ ఆ ఇద్దరు బ్రదర్స్ కొడుకును ఎంపీ చేయాలన్న నిర్ణయంతో మంత్రి పదవి పోటీ నుండి తప్పుకున్నట్టేనా..? 


Telangana: పార్లమెంట్ ఎన్నికలతో‌ ఆ జిల్లాకు‌ మంత్రి‌ పదవి దక్కబోతుందా..?

పార్లమెంట్ ఎన్నికలతో‌ ఆ జిల్లాకు‌ మంత్రి‌ పదవి దక్కబోతుందా..! ఆ వారసుడి రాజకీయ భవిష్యత్ కోసం ఆ ముగ్గురు కీలక నేతల మధ్య ఒప్పందం కుదిరిందా..? నాకంటే నాకే అమాత్య పదవి అంటూ పోటీ పడ్డ ఆ ఇద్దరు బ్రదర్స్ కొడుకును ఎంపీ చేయాలన్న నిర్ణయంతో మంత్రి పదవి పోటీ నుండి తప్పుకున్నట్టేనా..? కష్టకాలంలో పార్టీని ప్రాణంలా కాపాడుకున్న ఆ ఉమ్మడి జిల్లా నేతకే అమాత్య యోగం దక్కాలని గల్లీ నుండి ఢిల్లీ‌దాక వినిపించిన‌ వాయిస్ తో అదిష్టానం సైతం ఆలోచనలో పడిందట. ఆయనకు మంత్రి పదవి ఇస్తేనే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చేసిందట. మూన్నేళ్లు అడ్డుగోడగా నిలిచిన సమీకరణలన్నీ ఎంపీ ఎన్నికలతో పంటాపంచలైనట్టే కనిపిస్తుందట. ఇంతకీ ఆ నేత ఎవరు.. అమాత్యులు అయ్యే అదృష్టం ఎంత..?


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి మూడునెలలైనా.. ఇంకా ఇంఛార్జ్ మంత్రితోనే కొనసాగుతోంది. కీలక నేతలు గెలిచినా రాజకీయ సమీకరణలు, కుల సమీకరణలు అడ్డు రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అమాత్య యోగం దక్కలేదు. ఫస్ట్ లిస్ట్‌లోనే ఆ అవకాశం దక్కాల్సి‌ ఉన్నా, కుల సమీకరణలు అడ్డురావడం.. గెలిచిన నలుగురిలో ముగ్గురు కీలక నేతలుండటం.. వారి మధ్య పోటీ తీవ్రమవడంతో ఆదిలాబాద్‌కు మంత్రి యోగాన్ని హోల్డ్ చేసింది హస్తం అదిష్టానం.

అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికలు రావడంతో అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో మంత్రి‌పదవి చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. తూర్పు జిల్లా మంచిర్యాలలో మూడు మూడు స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్.. పెద్దపల్లి పార్లమెంట్ పరిదిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయడంతో ఈ సీటు నుండి టికెట్ దక్కించుకుంటే గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయానికి‌వచ్చారు ఆశావాహులు. దీంతో పెద్దపల్లి ఎంపీ సీటు‌ పోటీ తీవ్రమైంది. అయితే తమ వారసుడికే ఆ సీటు దక్కాలంటూ ఇటు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, అటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు పోటీ పడ్డారు. మంత్రి పదవి రేసులోను ఈ ఇద్దరు‌ ఉండటంతో కుమారుడికి ఎంపీ సీటు కావాలా.. మీలో ఒకరికి మంత్రి పదవి కావాలా ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ అదిష్టానం చెప్పడంతో డైలామాలో పడిపోయారు.



మరోవైపు అదే సీటు కోసం మంత్రి శ్రీదర్ బాబు తన అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేశారు. వివేక్, వినోద్‌లు మినహాయించి మిగిలిన పెద్దపల్లి పార్లమెంట్ ఎమ్మెల్యేలంతా మంత్రికే జై కొట్టడంతో గడ్డం బ్రదర్స్ ఇరకాటంలో పడిపోయారు. కొడుకు రాజకీయం కోసం మంత్రి పదవి ఆశలు వదులుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో‌ ఇన్నాళ్లు ఆ పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావుకు మళ్లీ ఆశలు చిగురిచ్చినట్లైంది. అటు నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్‌తోపాటు పెద్దపల్లి పార్లమెంట్‌లోని మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ప్రేంసాగర్ రావుకే మంత్రి పదవి దక్కాలని, ఆ నిర్ణయానికి ఏకీభవిస్తేనే ఎంపీ‌ ఎన్నికల్లో మీతో‌ కలిసి‌ నడుస్తామంటూ షరతు పెట్టడంతో గడ్డం బ్రదర్స్ ఓకే అన్నట్టు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ లో పార్టీ కష్టకాలంలో‌ ఉన్న సమయంలో నేనున్నానంటే అండగా నిలిచిన ప్రేంసాగర్ రావుకే మంత్రి పదవి ఇవ్వడం న్యాయమంటూ అంతా ముక్తకంఠంతో చెప్పడంతో అదిష్టానం సైతం సూచన ప్రాయంగా ఓకే చెప్పినట్టు సమాచారం.


అయితే మొదటి లిస్ట్ లోనే ఆదిలాబాద్ కు మంత్రి పదవి అవకాశం దక్కాల్సి ఉన్నా, గడ్డం బ్రదర్స్, ప్రేంసాగర్ రావుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటం. వెలమ సామాజిక వర్గ కోటాలో అప్పటికే జూపల్లి కృష్ణారావును, తుమ్మల నాగేశ్వరరావును అదిష్టానం ఫైనల్ చేయడంతో మొదటి లిస్ట్ లో ప్రేంసాగర్ రావుకు మంత్రి అవకాశం దక్కలేదు. ఇటు గడ్డం వినోద్ , వివేక్‌లు ఇద్దరు కూడా నాకంటే నాకే మంత్రి పదవి కావాలని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడంతో ప్రేంసాగర్ రావుకు ఇక మంత్రయ్యే ఛాన్స్ కష్టమే అన్న టాక్ కూడా వినిపించింది. దీంతో‌ ఇటు మంచిర్యాల నియోజక వర్గ కాంగ్రెస్ క్యాడర్ లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. కష్టకాలంలో పార్టీకి వెన్నెముక లా నిలిచిన వ్యక్తిని కాదని పార్టీలు‌ మారొచ్చని నేతలకు మంత్రి‌పదవి కట్టబెడుతారా అంటూ ఆగ్రహానికి దిగింది.



ఒకానొక దశలో క్యాడర్ ఆందోళనలకు సిద్దమవడంతో అలర్ట్ అయిన అదిష్టానం సీతక్కను ఇంచార్జ్ మంత్రిగా ఉమ్మడి ఆదిలాబాద్ కు పంపింది. అప్పటి నుండి మంత్రి పదవి ఆశలతో కొనసాగుతున్న నేతలకు పార్లమెంట్ ఎన్నిక వరంలా కలిసొచ్చింది. మా నేతకు మంత్రి‌పదవి కట్టబెడుతామని మాట ఇస్తేనే, మేమంతా కలిసొస్తామని ప్రేంసాగర్ రావు క్యాడర్ తేల్చి చెప్పడం.. మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం ప్రేంసాగర్ రావుకు జై కొట్టడంతో.. కొడుకు గెలుపు కోసం ఒక మెట్టు దిగి రాక తప్పలేదట గడ్డం బ్రదర్స్‌కి.


దీంతో రెట్టింపు ఉత్సాహంతో ఎంపీ ఎన్నికను భుజాల మీద వేసుకున్న ప్రేంసాగర్ రావు పార్లమెంట్ పరిదిలోని నియోజక వర్గాల్లో కంటే అధిక మెజార్టీ మంచిర్యాల నుండే రావాలంటూ క్యాడర్‌కు టార్గెట్ పెట్టడం.. గడ్డం వంశీ ని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపు తానంటూ ప్రతిజ్ఞ చేయడం చకచకా జరిగిపోయాయట. తానే ఎంపీ ఎన్నికల బాధ్యతను మోస్తానంటూ ముందుకొచ్చి మిగిలిన ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తీసుకొచ్చి వరుస సమావేశాలు కొనసాగిస్తున్నారట ప్రేంసాగర్ రావు. మా నేత ఇక మంత్రి‌ పక్కా అంటూ క్యాడర్ ముందస్తు‌ సంబరాలు చేసుకుంటుందట. మరీ అదిష్టానం ఆ సంబురాలకు న్యాయం చేస్తుందా లేదా చూడాలి..!

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow