ఒక్కడే ఒంటరిగా పాదయాత్రగా యాదగిరిగుట్టకు ఇంతకు ఎవరు ఎందుకు వెళ్తున్నారు
మహబూబ్నగర్ జిల్లా మిడ్జీలు మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన ముక్తాల యాదగిరి కాంగ్రెస్ యువ కార్యకర్త కు రేవంత్ రెడ్డి అంటే ఎన్నలేని అభిమానం. రెండు సంవత్సరాల క్రితం తన కులదైవమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి మొక్కుకున్నాడు అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయితే బైరంపల్లి గ్రామం నుండి యాదగిరిగుట్టకు కాలినడకన వస్తానని మొక్కుకున్నాడు.
తను అనుకున్నట్లే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో జడ్చర్ల శాసనసభ్యుడుగా అనుభూతి రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్లలో లేదంటే జనవరిలో పాదయాత్ర చేద్దామని సంకల్పించుకున్న సమయంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో దానిని విరమించుకున్నాడు.
ఉగాది దాటిన వెంటనే రోజులు బాగున్నాయని తెలుసుకొని తన పాదయాత్రను మొదలు పెట్టాడు.
ఈ పాదయాత్ర కార్యక్రమం జెండా ఊపి ప్రారంభించిన జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి మిడ్జిల్ కాంగ్రెస్ నేతలు పలువురు పాల్గొని తన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు కొద్ది దూరం తనతో పాటు పాదయాత్ర చేశారు.