ముదిరాజులను ఓటు బ్యాంకు చూస్తారా. బీసీ కమిషన్ లో కొట్లాటప్పుడే సుప్రీంకోర్టులో వాదనలు ఎందుకు..?

 ముదిరాజులను మోసగిస్తున్న పార్టీలు, ప్రభుత్వాలు ముదిరాజ్ సంక్షేమ సమితి -తెలంగాణ 

 #News@Jcl: రాష్ట్ర పరిధిలో ఉన్న రిజర్వేషన్ను సుప్రీంకోర్టుకు ఎందుకు




 అత్యంత దుర్బల స్థితిలో విద్య లేక ఆర్థికంగా చితికిపోయి ప్రధానమైన వృత్తి లేక సామాజిక వెనుకబాటుకు గురైన  ఆదిమ తెగ, విముక్త జాతి అయినటువంటి ముదిరాజులను 1970 అనంతరామన్ కమిటీ రిపోర్టులో ఏస్ టీ లో లేదా బీసీ ఏ ఉంచడానికి బదులు బీసీడీలో ఉంచడం అనేది పెద్ద పొరపాటు. ఇది ఒక పెద్ద స్థానిక మూలవాసుల సామజిక వర్గం పట్ల జరిగిన అగ్రవర్ణాల కుట్రగా చెప్పవచ్చు. 



 దానికి ఆమోదముద్ర వేసినది ఆనాటి 1972లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న  ఉన్న అపరచాణక్యులు గౌరవ పీవీ నరసింహారావు హాయంలోనే  అన్న సంగతి మరవరాదు.

 2009 ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవరాజశేఖర్ రెడ్డి , ఈ పొరపాటును గుర్తించి దాల్వ సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ ఆధారంగా ముదిరాజులను బీసీ ఏ లో చేరుస్తూ జీవో 15/2009 విడుదల చేయడం జరిగినది.



ఇది అమలు జరిగిన కొద్ది కాలంలోనే ముదిరాజులు ఎదిగే అవకాశం ఉందని గుర్తించి విద్య లేని అమాయకులైన ముదిరాజులను మోసగించడానికి కొన్ని కులాలు అగ్రవర్ణాల సహాయంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగినది. 



ఆనాటి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్థించడానికి బదులు నిమ్మకు నేరెత్తనట్టుగా ఉండటం ఆర్టికల్ 15(4),16(4) గౌరవించకపోవడమే అవుతుంది. 


 అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్న ముదిరాజ్ సంఘం నాయకులు, మేధావుల ఆలోచనల ములంగా కావచ్చు లేదా లోపాయికారి ఒప్పందం  వలన కావచ్చు హైకోర్టులో సరియైన వాదనలు వినిపించక పోవడం వలన జీవో 15 నిలుపుదల చేయడం జరిగినది.


దీనిని చాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో 2010లో పిటిషన్ వేయడం జరిగినది. 


  బీసీ ఏ కొరకు లేదా హైకోర్టు తీర్పు ఆధారంగా 12 సంవత్సరాల పాటు గౌరవ సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు కుల సంఘాలు కాని ప్రభుత్వం కానీ చేయలేదు. 


  చలనరహితంగా ఉన్న కాలంలో మేధావులతో కూడిన ముద్రాజ్ సంక్షేమ సమితి ఆవిర్భవించినది.


ముదిరాజ్ సంక్షేమ సమితి లేవనెత్తిన అనేక అంశాలకు జవాబు చెప్పలేని గౌరవ బండ ప్రకాష్ అధ్యక్షులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ గారు అంతర్లీనంగా ఇతర సంఘాలతో సమాలోచనలు జరిపి అర్ధాంతరంగా    రాష్ట్రంలోనే సమస్యను పరిష్కరిష్కరించుకుంటామని కేసుని వెనక్కి తీసుకొంటున్నామని గౌరవ సుప్రీంకోర్టులో తెలిపి రాష్ట్ర బీసీ కమిషన్ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది.


అదే సమయంలో ఈ సమస్యను పరిష్కరించామ ని అమాయక రాష్ట్ర ముదిరాజులనుమభ్యపెడుతూ సంబరాలు కూడా చేసుకున్నారు. 


 రాష్ట్ర పరిధిలోనికి తానే తెచ్చానని తానే పరిష్కరిస్తానని అనేక సమావేశాల్లో చెప్పడం జరిగింది.


 అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారిని కలిసి పిట్టల రవీందర్ గారికి పదవిని ఇప్పించగలిగారు  కానీ సమస్యను పరిష్కరించలేకపోయారు.


 

సుప్రీంకోర్టులో కేసు ఉన్నంతకాలం ప్రభుత్వమే తమ నిర్ణయాన్ని చెప్పడం లేదని ఆడిపోసుకుంటూ ఎలక్షన్లో లాభపడుతూ ముదిరాజులను మభ్యపెడుతూ కాలం వెలి బుచ్చిన నాయకులు 11-10-2022 న రాష్ట్ర బీసీ కమిషన్ పరిధిలోకి లోకి జీ వో 15/2009 సమస్య వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం ముదిరాజులను  మోసగిస్తున్నారని చెప్పడానికి ప్రభల నిదర్శనంగా చెప్పవచ్చు.


అదే సమయంలో షాద్నగర్లో పండగ సాయన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఒకే వేదికను పంచుకున్న ప్రధాన కుల సంఘ  నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ బీసీఏ డిమాండ్ చేయకపోవడం  గమనార్హం.


తదనంతరం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగినది. 


కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజులను బీసీ డీ నుండి బీసీఏ కు మారుస్తామని తెలపడం జరిగింది.


ప్రభుత్వం ఏర్పడి 120 రోజులు అయినా కూడా 

ముదిరాజుల సమస్య పరిష్కార కదలిక జరగకపోవడం విచారకరం. 


నారాయణపేటలో జరిగిన కాంగ్రెస్ సభలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి . ముదిరాజులను బీసీ డీ నుండి బీసీఏకి మార్చడానికి సుప్రీంకోర్టులో మంచి వాదనలు చేయిస్తామని చెప్పడం విడ్డూరం విచారకరం. 


సమస్య తన బీసీ కమిషన్ పరిధిలో ఉన్న సంగతి వారికి తెలియకుండా ఉంటుందా అనే అనుమానం ముదిరాజుల్లో కలుగుతుంది.

 

ముదిరాజులు అమాయకులు వీరిని మాటల ద్వారా మభ్యపెట్టవచ్చు ఎన్నికల్లో లబ్ది పొందవచ్చు అనే భావన ఉందా లేదా వీళ్లకు ఒక మంత్రి పదవి ఇస్తే సరిపోతుంది అని భావిస్తున్నారా అర్థం కాని విషయం.


 ముదిరాజులు ప్రభుత్వ తీరును, నాయకుల తీరును, కుల సంఘ నాయకుల తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు అనే విషయాన్ని  విస్మరిస్తున్నారు.


ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ముదిరాజ్ యువకులు, మేధావులు, మహిళలు మాత్రమే.


బాలు


గారి నర్సింలు ముదిరాజ్ 

 రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి, 

ముదిరాజ్ సంక్షేమ సమితి, తెలంగాణ. తోట సంజయ్ ముదిరాజ్, సినేటి శ్రీనివాస్ ముదిరాజ్, గోనెల కుమార్ ముదిరాజ్,వొన్నోజిపేట రమేష్ ముదిరాజ్, కీరణ్ ముదిరాజ్, టేకుల శ్రీను, విజయ, నీరజ ముదిరాజ్లు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow