కారు దిగేస్తున్నారు! కొత్తగా కడియం, దానం?

 కాంగ్రెస్‌, బీజేపీ వైపు బీఆర్‌ఎస్‌ నేతల చూపు.. కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశాలు



కడియం శ్రీహరితో టచ్‌లోకి కాంగ్రెస్‌.. కడియం చేరితే వరంగల్‌ లోక్‌సభ టికెట్‌?


తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్‌ ఉప ఎన్నికలో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్‌ ఆఫర్‌!


వేం నరేందర్‌, కోమటిరెడ్డితో అమిత్‌రెడ్డి భేటీ.. కాంగ్రెస్‌ సర్కారుకు దానం కితాబు


బీజేపీలోకి ఆరూరి రమేశ్‌.. నేడు అమిత్‌ షా సమక్షంలో చేరిక


హైదరాబాద్‌, మార్చి: బీఆర్‌ఎ్‌సలో కీలక నేతలు పక్క చూపులు చూస్తున్నారా? కారు దిగేందుకు సిద్ధమవుతున్నారా? గులాబీ కండువాను తీసేసి.. కాంగ్రెస్‌ లేదంటే బీజేపీలో చేరే దిశగా ఆలోచన చేస్తున్నారా? ప్రత్యర్థి పార్టీని పొగడటమే ఎరుగని ఓ కీలకనేత, ఆశ్చర్యకరమైన రీతిలో ఆహా.. ఓహో అని ప్రభుత్వాన్ని పొగడటం.. ఇంకొందరేమో బాహాటంగానే ప్రత్యర్థి పార్టీల నేతలతో భేటీ అవుతుండటం.. ఇలా బీఆర్‌ఎ్‌సలో మునుపెన్నడూ కనిపించని పరిణామాలను చూస్తుంటే ఆ పార్టీ ఒకింత ఇబ్బందికర, అయోమయమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందనే చెప్పొచ్చు. తాము గేట్లు ఎత్తితే బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందంటూ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే కొందరు కీలక నేతలు కాంగ్రె్‌సతో టచ్‌లోకి వెళ్లి ఉంటారా? అనే ఆందోళనలు గులాబీ దళంలో వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలు కూడా బీఆర్‌ఎస్‌ నేతలకు ‘గేట్లు తెరిచే దిశ’గానే సాగుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రె్‌సలో చేరారు. నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ కూడా బీజేపీలో చేరారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ కూడా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయన మంగళవారం కేంద్ర మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. బుధవారం ఆరూరి కాషాయ కండువాను కప్పుకొనే అవకాశమున్నట్లు సమాచారం. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని మళ్లీ పోటీ చేయించాలని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. తాను ఈసారి లోక్‌సభకు పోటీ చేయబోనని ప్రకటించారు. సిటింగ్‌ ఎంపీనే పార్టీ టికెట్‌ వద్దనడం ఏమిటి?ఎందుకు వద్దన్నారు? ఆయన బీఆర్‌ఎ్‌సను వీడనున్నారా? అనే ప్రశ్నలతో ఆ పార్టీ నేతలు జుత్తు పీక్కుంటున్నారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌ రెడ్డి తీరూ సందేహాలకు తావిస్తోంది. తనకు బీఆర్‌ఎస్‌ నల్లగొండ లోక్‌సభ టికెట్‌ ఇస్తే పోటీ చేస్తానంటూ ఇదివరకే ఆయన ప్రకటించారు. ఆయనే ఇటీవల ఆశ్చర్యంగా తాను పోటీ చేయలేనంటూ చెప్పేశారు. ఈ క్రమంలో ఆయన, సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అమిత్‌, మంత్రి కోమటిరెడ్డినీ కలిశారు. పైగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సోమవారం నిర్వహించిన సమావేశానికి అమిత్‌ గైర్హాజరయ్యారు. ఈ పరిణామాలు నల్లగొండ బీఆర్‌ఎస్‌ శిబిరంలో చర్చనీయాంశంగా మారాయి.


కొత్తగా కడియం, దానం?


బీఆర్‌ఎ్‌సకు చెందిన కీలక నేత, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎ్‌సను వీడి, కాంగ్రె్‌సలో చేరే అవకాశాలున్నాయంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎ్‌సకు కడియం ఎంతో కావాల్సిన నేత. అసెంబ్లీలో ఆ పార్టీ తరపున కేటీఆర్‌, హరీశ్‌రావు మాట్లాడినా... వారంతా కుటుంబ నేతలని కాంగ్రెస్‌, బీజేపీ విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలను తిప్పికొడుతున్నట్లుగా సభలో అనుభవజ్ఞుడైన కడియం శ్రీహరిని ముందుకు తెచ్చి మాట్లాడిస్తోంది. మరి ఆయన పార్టీని వీడితే పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. కడియంతో ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు టచ్‌లోకి వచ్చారని తెలిసింది. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన్ను పోటీ చేయించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. 2016లో వరంగల్‌ ఎంపీగా గెలిచిన శ్రీహరికి జిల్లా వ్యాప్తంగా సత్సబంధాలుండటంతో ఆయన్ను పార్టీలోకి చేర్చుకొని, పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నుంచి కడియం గెలిస్తే.. ఆయనతో స్టేషన్‌ఘన్‌పూర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయించి, ఉప ఎన్నికలో ఆయన కుమార్తె కడియం కావ్యకు టికెట్‌ ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే తన కుమార్తె కావ్యకే వరంగల్‌ లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలంటూ కడియం ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తీరూ అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దానం కితాబిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం రోజుకో శుభవార్త చెబుతోందంటూ మాట్లాడారు. ఆర్టీసీ ఉంటుందా? ప్రైవేటు పరం అవుతుందా? అనే ఆందోళనలో ఉన్న ఉద్యోగులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోందని ప్రశంసించారు. ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, దీన్ని గుర్తించే కాంగ్రెస్‌ ప్రభుత్వం వారి పక్షపాతిగా వ్యవహరిస్తోందనీ వ్యాఖ్యానించారు. మరి.. ఆయన ఈ వ్యాఖ్యలు దేనికి సంకేతం? అన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిజంగానే మెచ్చుకుంటున్నారా? లేదంటే పార్టీ మారే ఆలోచనతోనే ‘పొగిడారా’? అని చర్చించుకుంటున్నారు.( కార్యశాల) నిర్వహించబడింది.

మహిళ అన్ని రంగాలలో అభివృద్ధి చెందడమే దేశ ప్రగతికి దారితీస్తుందని, కాబట్టి మహిళలపై పెట్టుబడి అవసరమని ఈ కార్యశాల తీర్మానించింది. సభాధ్యక్షులు కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు అధ్యక్షోపన్యాసంలో మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, కళాశాల విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారత విభాగం కన్వీనర్ ఎన్.సుభాషిణి మాట్లాడుతూ మహిళ ఒక సమిష్టి శక్తిగా ఎదగాలని అవరోధాలను అవకాశాలుగా మలుచుకునే శక్తి మహిళలకు మెండు అని తెలిపారు.నెలసరి సమస్యలు-నివారణోపాయాలు, సమతులాహారం అనే అంశం పై   సుశ్రుత హాస్పిటల్ ఎం.డి ప్రముఖ గైనకాలాజిస్ట్

డా.ప్రతిభ విద్యార్థులకు పీపీటీ ద్వారా చక్కని అవగాహన కల్పించారు.సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ వంటి పలు స్త్రీల సమస్యలకు నివారణోపాయాలు సూచించారు.విద్యార్థులు ప్రశ్నావళులను పూరించారు. రెండవ సెషన్ లో మహిళా సాధికారతలో సామాజిక సేవా సంస్థల పాత్ర అనే అంశంపై పాలమూరు విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ మాట్లాడారు.NSS వంటి సంస్థల ద్వారా విద్యార్థుల లో సమన్వయ శక్తి పెరుగుతుందన్నారు.మూడవ సెషన్ లో మహిళా వ్యవస్థాపకులు- సవాళ్లు అనే అంశంపై లక్కీ బ్యూటీ కేర్ వ్యవస్థాపకురాలు ఎన్ యశస్విని, శ్రీ సాయి బొతిక్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి తమ జీవితానుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. అడ్డంకులు అనేకం వస్తాయని సవాళ్లను స్వీకరించే లక్షణం పెంపొందించుకోవాలన్నారు. ఆవేదనలు ఆక్రోశాలకు చోటు లేదు, విజయమే మాట్లాడుతుందన్నారు.కళాశాల విద్యార్థులు మగువా మగువా అనే పాటపై చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించిందికార్యక్రమంలో మహిళా సాధికారత విభాగ సభ్యులు నీరజ, మంజుల, సుభాషిణి, మంజుల, రమాదేవి, లత, రజిని, అనిత ,భార్గవి లత, శ్రావణి, మాధవి,  మాధవి,సింధులు, జగన్, బాలరాజు, విట్టల్, మల్లికార్జున్, మరియు 400కు పైగా విద్యార్థినులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow