కొత్తకోట :-ఘోర కారు ప్రమాదం.. ఐదుగురు మృతి

 



TS News: ఘోర కారు ప్రమాదం.. ఐదుగురు మృతి



కొత్తకోట మండలం 44 జాతీయ రహదారి పై మారుతి ఎర్టిగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తున్న మారుతి ఎర్టిగా కారు టెక్కెలయ్య దర్గా సమీపంలో రాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది.



వనపర్తి: కొత్తకోట మండలం 44 జాతీయ రహదారి పై మారుతి ఎర్టిగా (Maruthi Ertiga) కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదం (Accident)లో ఐదుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తున్న మారుతి ఎర్టిగా కారు టెక్కెలయ్య దర్గా సమీపంలో రాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఇక గాయాలపాలైన నలుగురిలోనూ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అంబులెన్స్‌ (Ambulance)లో చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow