*
*-బ్యాగులో కిలోకి పైగా గంజాయి ఎలక్ట్రిక్ కాంట లభ్యం*
*-
జడ్చర్ల 44 వ జాతీయ రహదారిపై బ్యాగులో కిలోకి పైగా గంజాయి ఎలక్ట్రిక్ కాంటా దొరకడం కలకలం రేపింది. అది దిశ పత్రికలో సోమవారం కిక్కు , కు బానిసవుతున్న యువత పలు రకాల మత్తు పదార్థాల వైపు మొగ్గు చూపుతున్న జడ్చర్ల యువత అనే శీర్షికతో కథనం ప్రచురణాయనరోజే గంజాయితోపాటు ఎలక్ట్రిక్ కాంటా దొరకడంతో సోమవారం *దిశ* పత్రికలో వచ్చిన కథనం నిజమేనని తేలింది. సోమవారం జడ్చర్ల పట్టణంలోని బూరెడ్డిపల్లి వద్ద గల రహదారి పక్కలో గల ఎఫ్సిఐ గోదాం వద్ద ఓ బ్యాగు అనుమానాస్పదంగా పడి ఉండడంతో గోదాంలోని పనిచేసే కార్మికులు వాటిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల పట్టణ సిఐ రమేష్ బాబు ఘటన స్థలానికి చేరుకొని బ్యాగును పరిశీలించగా బ్యాగులో కిలోకి పైగా గంజాయి గ్రాములవారీగా తూకం చేసే ఎలక్ట్రిక్ కాంట ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనపరుచుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని గంజాయి ఎలక్ట్రిక్ కాటా తో ఉన్న బ్యాగు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పడేస్తారా లేక ఇక్కడైనా గాంజాయ్ సప్లై చేస్తున్నారా లేదా గంజాయి ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నామని పట్టణ సిఐ రమేష్ బాబు తెలిపారు. కాగా జడ్చర్ల పట్టణంలో గంజాయితోపాటు గ్రాములవారీగా తూకం చేసే ఎలక్ట్రిక్ కాటా దొరకడం జడ్చర్ల పట్టణంలో మత్తు పదార్థాలు గంజాయి ఏ స్థాయిలో క్రయవిక్రయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు పట్టణంలోని యువత గాంజాయ్ తో పాటు మత్తు కొరకు వివిధ రకాల కెమికల్స్ ను దగ్గు మందులను వైట్నర్లను కార్పెంటర్లు వాడే గమ్ములను కొనుగోలు చేసి కర్చీఫ్ ల్లో వాటిని వేసుకొని వాటి వాసన ను ఆస్వాదిస్తూ మత్తులోకి జారుతున్నారని ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియనంత స్థాయికి వెళుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు వీటికి తోడుగా పట్టణంలోనే పలుకుడల్లో నూతనంగా ఏర్పాటైన టీ పాయింట్ల వద్ద డేరాలు ఏర్పాటు చేయడంతో ఆ డేరాల్లో సిగరెట్టు మాటను మత్తుపదార్థాలు సేవిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జడ్చర్ల పట్టణంలోని నిర్మాణస్య ప్రాంతాల్లో సంచరించే యువతపై మత్తు పదార్థాలు విక్రయించే వారిపై సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి యువత ను చెడు వ్యసనాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు
.jpg)