*నాన్న నీ వెంటే నేనుకూడా...*
*-మృత్యువులోను వీడని తండ్రి కూతుర్ల బంధం*
*-తండ్రి మరణం తట్టుకోలేక కూతురీ మృతి*
*-జడ్చర్ల పట్టణంలో ఘటన*
Newsatjcl spl జడ్చర్ల :
ఆ కూతురికి తండ్రి అంటే ఎంతగానో ప్రేమ చిన్ననాటి నుండి ఆ తండ్రి కూతుర్లకు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమానురాగాలు వీళ్ళ ప్రేమను చూసిన విధి కి కుళ్ళు పుట్టిందేమో.. ఓర్చుకోలేకపోయింది అందుకేనేమో వారి మరణాన్ని కూడా ఒకేసారి లిఖించింది. తండ్రి మరణాన్ని చూసి తండ్రి అంత్యక్రియల సమయంలో కుప్పకూలి కూతురు కూడా మృతి చెందిన హృదయ విధారకరమైన ఘటన పలువురిని కంటతడి పెటించిన ఘటన ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన దామోదర్ (82) శనివారం రాత్రి అకాల మరణం చెందారు. దీంతో చిన్ననాటి నుండి తన తండ్రి ప్రేమను తనకు మాత్రమే సొంతం చేసుకున్న కూతురు సునీత(52) తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆదివారం అంత్యక్రియల సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. దీంతో కుటుంబీకులు హుటాహుటిన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే కూతురు సునీత మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఒకరి అంత్యక్రియలో పాల్గొనడానికి వచ్చిన బంధువులు మరొకరి మరణాన్ని చూడడం పలువురి హృదయాలను కలచివేసింది. తండ్రి కూతుళ్లు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండే వారని దీంతో తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు కూడా మరణించడం పలువురిని కంటతడి పెట్టించింది. కాగా జడ్చర్ల పట్టణంలోని సాయి నగర్ నివాసం ఉంటున్న కూతురు సునీత నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. తండ్రి కూతుళ్ళ ప్రేమను తట్టుకోలేని విధి కూడా వారి మరణాన్ని ఒకేసారి లిఖించిందేమో అన్నట్టుగా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. తండ్రి కూతుర్ల మరణ వార్త జడ్చర్ల పట్టణం వ్యాప్తంగా తెలియడంతో పలువురు విచారం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
.jpg)