కన్నబిడ్డలనే అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి*

 *జల్సాలకు అలవాటు పడి కన్నబిడ్డలనే అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి*



*అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు*


*పోలీసుల సహకారంతో క్షేమంగా తల్లి వద్ద చేరిన ముగ్గురు పిల్లలు*


*కసాయి తండ్రికి దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు*


*జడ్చర్ల పట్టణంలో కలకలం రేపిన ఘటన

Newsatjcl జడ్చర్ల : తాగుడుకు జల్సాలకు అలవాటు పడి తాను ఆ

చిన్నారులకు తండ్రిని అనే విషయాన్ని మరిచి తాను కన్నా

ముగ్గురు పిల్లలను 9 లక్షలకు అమ్మే ప్రయత్నం చేసి

దొరికిపోయిన ఘటన సోమవారం జడ్చర్ల పట్టణంలో తీవ్ర

కలకలం రేపింది. భూత్పూర్ మండలం తాడిపత్రికి చెందిన

రఫీక్ తో జడ్చర్ల పట్టణంలోని నిమ్మ బావి గడ్డ కు చెందిన

హబీబున్నిస తో గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం

జరిగిందని వీరికి ఒక ఆడ కూతురు, ఇద్దరు మగపిల్లల

సంతానం కాగా వీరు జడ్చర్ల పట్టణంలోని గౌరీ శంకర్

కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రఫీ చెడు

అలవాట్లకు, తాగుడుకు బానిస అయ్యాడని ఇతడు కుటుంబ

సభ్యులతో ఉండకుండా తరచు గోవా రాష్ట్రం వెళుతూ గోవాలో

అనేక చెడు వ్యసనాలకు బానిస అవడంతో పాటు ఇంకో

వివాహం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.




Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow