370 ఉపసంహరించుకున్న న్యాయ అధికారం కేంద్ర ప్రభుత్వం ఉంటుంది..... తాము అందులో జోక్యం చేసుకోలేము - సుప్రీం కోర్ట్
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని ఐదుగురు జడ్డిలు చదువుతున్నారు. ఐదుగురు జడ్జిల్లో ముగ్గురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తీర్పును చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ చదివి వినిపిస్తున్నారు. భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని తెలిపింది. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని వివరించింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది.
దీనిపై సోమవారం వెలువరించిన తీర్పులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం అని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు నిచ్చింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 తాత్కాలికమేయుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమే 370జమ్మూ కాశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదుభారత రాజ్యాంగమే ఫైనల్ అని జమ్ము కాశ్మీర్ రాజు నాడు ఒప్పందం చేసుకున్నారు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చుడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేసిన పిడిపి సహా కాశ్మీర్ పార్టీలు 16 రోజులపాటు ఈ కేసు పై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనంఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సెప్టెంబరు 5న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. కాగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే దీనిని స్థానిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయా పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి.