Telangana: మంత్రులుగా ప్రమాణం చేయనుంది వీళ్లే..!
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరే సమయం ఆసన్నమైంది. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు సర్వంసిద్ధమైంది. సరిగ్గా ఒంటి గంటా నాలుగు నిమిషాలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్. అందుకు, సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ఎల్బీ స్టేడియం.
కేబినెట్ బెర్త్ దక్కించుకున్న వారి వివరాలు
భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం
ఉత్తమ్ కుమార్ రెడ్డి
పొన్నం ప్రభాకర్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
దామోదర రాజనర్సింహ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొండా సురేఖ
సీతక్క
తుమ్మల నాగేశ్వరరావు
జూపల్లి కృష్టారావు
ఎల్బీ స్టేడియం సెంటిమెంట్ ఏంటి?
సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారాలు రాజ్‌భవన్‌లోనే జరుగుతాయ్. అయితే, ఆ రెగ్యులర్ ఫార్మాట్‌ను బ్రేక్‌చేసి ట్రెండ్ సృష్టించారు ఎన్టీఆర్. 1994 డిసెంబర్‌లో ఎల్బీ స్టేడియం వేదికగా అచ్చ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు ఎన్టీఆర్. ఆనాడు ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవం జాతరను తలపించింది. అప్పట్లో అదో సంచలనం. ఆ తర్వాత అదే ట్రెండ్‌ను కొనసాగించారు వైఎస్సార్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో ఇదే ఎల్బీస్టేడియంలో వేలాదిమంది ప్రజల మధ్య ప్రమాణస్వీకారం చేశారు. అక్కడే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా ఎల్బీ స్టేడియం ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్…. సకల జనుల సాక్షిగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేయబోతున్నారు.
