మహబూబ్ నగర్ నియోజకవర్గం
శివ శక్తి నగర్ వార్డు నెంబర్ 23
అభివృద్ధి ని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత నాదే : యెన్నం
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 23 వ. వార్డు కాంగ్రెస్ నాయకులు కుర్వ నరేష్ యాదవ్. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్. నక్కినమొని కుమార్ టౌన్ ఓబీసీ సెల్ జనరల్ సెక్రెటరీ. ముక్రమ్ టౌన్ జనరల్ సెక్రెటరీ. ఫహీమ్ రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ. 23 వార్డులో శివ శక్తి నగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం లో ప్రజలు శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి కి బాణాసంచా, డప్పుల దరువులు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ముందుగా శివ శక్తి నగర్ లోని శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలని పరిష్కరించాలని విన్నవించారు. వర్షాకాలం వస్తే చాలు వీధులు చెరువులు అవుతాయి అని వారు శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి తో చెప్పి వాపోయారు.
Tags
News@jcl


