తెలంగాణ అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలి.. కేసీఆర్ కు భట్టి సవాల్
సెక్రటేరియట్ కి రాని... ప్రగతి భవన్ వీడని కెసిఆర్ సీఎంగా అవసరమా?
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల హామీలను 10ఏండ్లుగా అమలు చేయాలన్న సోయి ఎందుకు లేదు
తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా ఉన్న బిఆర్ఎస్ ను గద్దె దింపుదాం
బిఆర్ఎస్, సీపీఎంల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరిక
ఎన్నికల ప్రచారంలో భట్టికి జై కొట్టిన ఎరుపాలెం ప్రజలు
-------------++++---
పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో సీఎం కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం ఎస్సీ కాలనీ, తెల్ల పాలెం, బంజారా, పెద్ద గోపవరం, కందిరిక, బనిగండ్లపాడు, బుచ్చిరెడ్డిపాలెం, నరసింహపురం, కాచవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం టిఆర్ఎస్ పార్టీలకు చెందిన మండల నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార సభలలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేసి తిన్నటువంటి సొమ్మును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని, దోపిడి అరికడతామని అన్నారు. బీఆర్ఎస్ పరిపాలన నలిగిపోతున్న తెలంగాణ ప్రజలకు విముక్తి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లు కేసీఆర్ కి అధికారం ఇస్తే ఏం చేసిండు? ప్రజా సంపదను దోచుకున్నాడు, దాచుకున్నారని విమర్శించారు.
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రగతిభవన్ వీడడు, సెక్రటేరియట్ కి రానటువంటి సీఎం కేసీఆర్ మనకు అవసరమా? ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ మాదిరిగా ఫామ్ హౌస్ లో పడుకోలేదని. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో తిరిగాననని చెప్పారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రజల్లోనే ఉన్నానని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎప్పుడైనా ప్రజల్లో కనిపించారా? అని ప్రశ్నించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణలో పీపుల్స్ ప్రభుత్వం తీసుకురావడానికి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నాలుగు నెలలు ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా మండుటెండల్లో పాదయాత్ర చేసి
ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఐదేండ్లు పోరాటం చేశానని చెప్పారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు పదేండ్లు అధికారంలో ఉన్న మీకు అమలు చేయాలన్న సోయి ఎందుకు రాలేదని ఎద్దేవా చేశారు.
ఇల్లు, ఇంటి స్థలం, ఫీజు రియంబర్స్మెంట్, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చారా? కరెంటు ఇచ్చారా? పది సంవత్సరాలుగా తెలంగాణకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా బిఆర్ఎస్ పరిపాలన మారిందని అన్నారు. 10 సంవత్సరాల బడ్జెట్, అప్పు చేసి తెచ్చిన
5 లక్షల కోట్ల రూపాయలను బిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేశారని దుయ్యబట్టారు.
దొరల తెలంగాణ వద్దు ప్రజల తెలంగాణ తెచ్చుకుందామన్నారు. ప్రజల సంపద ప్రజలకి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు.
ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. కానీ కేసీఆర్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ఉందని తెలిపారు. రాష్ట్రం సంపదను పదికోక్కుల్లా దోచుకొని కాంగ్రెస్ పార్టీ ని విమర్శించడానికి సిగ్గుండాలని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడేందుకే రాష్ట్రలో తిరిగానని అన్నారు. సంపద కలిగిన రాష్ట్ర కనుక 6 గ్యారంటీలు ప్రకటించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల కోసం అలోచన చేసే..
కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ,అభివృద్ధి పథకాలు తిరిగి అమలు చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ,అభివృద్ధి పథకాలు తిరిగి అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలవడం ఖాయమని తెలిపారు. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ తెలంగాణ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మేము అధికారంలో ఉన్నప్పుడు ఎర్రుపాలెం మండలంలో నిధులు పారించామన్నారు.
మేము అధికారంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తెల్ల పాలెం నుంచి జమలాపురం వరకు రోడ్డును వేయిస్తామని హామీ ఇచ్చారు.
Tags
News@jcl
