ICC World Cup 2023:సెమీస్‌ బెర్తు కోసం ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే? ప్రపంచకప్‌లో టీమిండియా జోరు.

ICC World Cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియా జోరు.. సెమీస్‌ బెర్తు కోసం ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఆదివారం ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది టీమిండియా. తద్వారాఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. అలాగే పాయింట్ల పట్టికలోనూ టాప్‌కు దూసుకెళ్లింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ఇక టీమిండియా చేతిలో ఓటమితో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ICC World Cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియా జోరు.. సెమీస్‌ బెర్తు కోసం ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే? ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఆదివారం ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది టీమిండియా. తద్వారాఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. అలాగే పాయింట్ల పట్టికలోనూ టాప్‌కు దూసుకెళ్లింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ఇక టీమిండియా చేతిలో ఓటమితో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా 10 పాయింట్లతో ఉన్న ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక ఆరు పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే భారత జట్టు 10 పాయింట్లు సాధించినా.. సెమీఫైనల్‌లోకి ఇంకా అధికారికంగా ప్రవేశించలేదు. ఇదే ఫార్మాట్‌లో జరిగిన 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఐదు విజయాలతో నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే ఒక గేమ్ వాష్ అవుట్ కావడంతో 11 పాయింట్లు నమోదయ్యాయి. అలాగే, నెట్ రన్ రేట్ (NRR) కారణంగా పాకిస్థాన్ 11 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2019 ఎడిషన్‌లో వర్షం కారణంగా మొత్తం నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే ఈసారి అలా జరిగే అవకాశం లేదు. తద్వారా 10 పాయింట్లు సాధించినా భారత్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించలేదు. కాబట్టి, సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఒక జట్టు కనీసం ఆరు విజయాలు సాధించాలి. రోహిత్ సేన ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. కాబట్టి మరో మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ బెర్తు దక్కుతుంది. టీమ్ ఇండియాకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఒకటి గెలిస్తే సెమీ ఫైనల్‌కు చేరుకోవచ్చు. అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో, నవంబర్ 2న శ్రీలంకతో, నవంబర్‌ 5న దక్షిణాఫ్రికా, ఇక చివరిగా నవంబర్ 12న బెంగళూరులో నెదర్లాండ్స్‌తో తలపడనుంది టీమిండియా. నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. భారత్‌తో పాటు న్యూజిలాండ్ కూడా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడం దాదాపు ఖాయంగా అనిపిస్తుంది. మరి మిగతా రెండు జట్లేవో ఇంకా తెలియాల్సి ఉంది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow