న్యూఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా శుక్రవారం సాయంత్రం విడుదల కానుంది. 45 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ సిఈసీ ఖరారు చేసింది. ఇంకా పెండింగ్‌లో 15 స్థానాలు ఉన్నాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు సీట్లపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో మరోసారి చర్చలు జరగనున్నాయి.
Congress List: ఈ సాయంత్రం టీ.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
న్యూఢిల్లీ: కాంగ్రెస్ (Congress) అభ్యర్థుల రెండో జాబితా (Second list) శుక్రవారం సాయంత్రం విడుదల కానుంది. 45 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ సిఈసీ (CEC) ఖరారు చేసింది. ఇంకా పెండింగ్‌లో 15 స్థానాలు ఉన్నాయి. ఖమ్మం (Khammam), నల్గొండ (Nalgonda), మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలోని పలు సీట్లపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో మరోసారి చర్చలు జరగనున్నాయి.
పెండింగ్:
ఖమ్మం జిల్లాలో ఇల్లందు, పాలేరు; నల్లగొండ జిల్లా.. దేవరకొండ, తుంగతుర్తి, సూర్యాపేట; మహబూబ్‌నగర్ జిల్లా.. మక్తల్, జడ్చర్ల; కామారెడ్డి, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో రేవంత్ (Revanth), ఉత్తమ్ (Uttam), కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers), భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పోటీ చేసే అవకాశం ఉంది. కీలక నేతలు రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ (Muralidharan) శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్నారు. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేశామన్నారు. కమ్యూనిస్టు పార్టీల నేతలతో చర్చలు జరుగుతున్నాయని, చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరిందన్నారు. అయితే ఏ స్థానాలు ఇవ్వాలన్న విషయంపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుందని, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట మిత్రపక్షలకు ఇచ్చే ప్రసక్తే లేదని మురళీధరన్ స్పష్టం చేశారు.
కాగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge) ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారం ఉదయం ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం అయింది. ఈ భేటీలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. గత మూడు రోజులుగా జరిగిన కసరత్తును ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్.. సీఈసీ ముందు పెట్టారు. అయితే 45 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 15 స్థానాలు పెండింగ్ పెట్టారు.
సీఈసీ భేటీకి ముందు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పలువురు నేతలు పార్టీలో చేరారు. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Former MP Komatireddy Rajagopal reddy) , మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి (Former MLA Enugu Ravinder Reddy), మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌లు (former MLC Santosh) కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు.
Tags
News@jcl

