నారాయణపేట జిల్లాలోని జూరాల బయో రిఫైనరీ ఫ్యాక్టరీ దగ్గర దారుణం!! ci గాయాలు పోలీసు వాహనానికి నిప్పు!

నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో
జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దాని కంపెనీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు నిరసనలు తెలపడం జరుగుతుంది ఈ ఫ్యాక్టరీ ద్వారా వెలవడె వ్యర్థాల వల్ల మా యొక్క నీరు మరియు భూగర్భ జలాలు అన్ని కలిషితమైపోతున్నాయని వారు ఈ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు నిన్న రాత్రి ఈ కంపెనీ నుండి వ్యర్థాలతో వెళ్తున్న ట్యాంకర్ ను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఈ వ్యర్థాలను పరీక్షించాలని పరీక్షిస్తే దాంట్లో ఉన్న రసాయనాలు తెలుస్తాయని దాని వల్ల మాకు హాని ఎంత ఉందో తెలుస్తోంది అని వారు నిన్న రాత్రి నుండి ఆ వాహనాన్ని అడ్డుకొని రహదారిపై నిరసన తెలుపుతున్నారు. ఈరోజు ఉదయం స్థానిక సిఐ రాంలాల్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడడానికి ప్రయత్నించగా వాళ్ళు వినకపోవడంతో బలవంతంగా వాహనం తీసుకెళ్లడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకొనడం జరిగింది దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు దీనిపై గ్రామస్తులు ఆగ్రహంతో పోలీసులపై తిరగబడి పోలీసుల వాహనాలను ధ్వంసం చేయడం ఒక వాహనాన్ని దగ్ధం చేయడం జరిగింది ఇలా గ్రామస్తులు విసిరిన రాళ్లకు దెబ్బలకు స్థానిక సీఐ రాంలాల్ కు గాయాలు అవ్వడం జరిగింది.పోలీసులు లాఠీచార్జి తో గ్రామస్తులకు గాయాలయ్యాయి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు ఆగ్రహంతో కనిపించిన పోలీసులను తమ ఇళ్లలో వేసి తాళాలు వేయడం జరిగింది.ఈ కంపెనీ మూసి మాకు న్యాయం చేయాలని వారు నిరసన తెలుపుతున్నారు. మండల పరిధిలోని చిత్తనూరు శివారులో ఉన్న ఇతనాలు కంపెనీ రద్దు చేసేంతవరకు మా పోరాటం ఆపమంటున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.రాత్రి ఇతానాలు కంపెనీ నుండి వ్యర్త రసాయనాలు తీసుకు వెళ్లడం చూసి వాహనాలను ఆపి బైఠాయించారు విత్తనాలు కంపెనీ బందు చేసేంతవరకు ఆపము అంటున్న వివిధ గ్రామ ప్రజలు. 114 రోజులనుండి ధర్నా చేస్తున్న ఇప్పటి వరకు ఒక అధికారి కూడా రావడం లేదు. ఈ రోజు వచ్చిన MRO 25వ తేదీ రోజు సమస్యల పరిస్కారం చేస్తాం అన్న కూడా మాకు మీద నమ్మకం లేదంటున్న ప్రజలు.కలెక్టర్ వచ్చి వెల్లెవరకుమా పోరాటం ఆగదూ.
Previous Post Next Post

نموذج الاتصال