“పదిరోజుల్లో చెత్త తొలగించండి…ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అల్టిమేటం.

 “పదిరోజుల్లో చెత్త తొలగించండి… లేదంటే మీ కంపెనీల ముందే పోయిస్తా!” – పోలేపల్లి ఫార్మా కంపెనీలకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు హెచ్చరిక

పోలేపల్లి ఫార్మా సెజ్‌లో కాలుష్యం హద్దుమీరింది… 10 రోజుల్లో చెత్త తొలగించకపోతే కంపెనీల ముందే డంప్ చేస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అల్టిమేటం.




జడ్చర్ల పోలేపల్లి ఫార్మా సెజ్‌లో పారిశ్రామిక చెత్త వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. అదే ప్రాంతంలో ఎస్సీలకు కేటాయించిన స్థలాన్ని కొన్ని ఫార్మా కంపెనీలు చెత్త డంపింగ్ యార్డ్‌గా మార్చాయని ఎమ్మెల్యే డాక్టర్ అనిరుద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం సాయంత్రం మున్సిపాలిటీ ఊరవరుపు వద్ద మాట్లాడిన ఆయన… పదిరోజుల్లో చెత్త తొలగించకపోతే ఆయా కంపెనీల ముందే ట్రాక్టర్లతో తీసుకెళ్లి పోయిస్తానని కఠిన హెచ్చరికలు చేశారు.

ఫార్మా కంపెనీలు పగటిపూట చెత్తను పారేయడం, రాత్రి సమయంలో కాల్చివేయడం వల్ల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని, వాయు కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేస్తానని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత స్వయంగా వచ్చి చెత్తను పరిశీలించి ఏ కంపెనీలు ఈ చెత్త వేస్తున్నాయో గుర్తించి వాటి ముందే పారవేయిస్తానని స్పష్టం చేశారు.

ఎస్సీల అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని చెత్తతో నింపడం అసలు సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow