గ్రామపంచాయతీలలో పర్యటించిన జిల్లా ఎస్పీడీ జానకి

  



జడ్చర్ల రూరల్: నిన్నటితో రెండవ విడత నామినేషన్ల పర్వం పూర్తవడంతో నేటితో జడ్చర్ల మండలంలో మూడో విడత నామినేషన్ల పర్వం మొదలైంది.

 ఈ సందర్భంగా. జిల్లా ఎస్పీ డి జానకి ఐపిఎస్ గ్రామ పంచాయతీల పరిధిలో నామినేషన్ల పర్వాన్ని పరిశీలించారు. 

ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలి అని పోలింగ్ బూతుల దగ్గర ఉన్న కానిస్టేబుల్ లకు సూచనలు చేశారు. 

జడ్చర్ల లోని పలు పోలింగ్ స్టేషనులను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్న అభ్యర్థులతో పాటు వచ్చిన మద్దతుదారులను పోలింగ్ స్టేషన్కు నిర్ణయించిన దూరంలో ఉండకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈ సందర్భంగా అక్కడే ఉన్న రూరల్ సీఐ నాగార్జున గౌడ్ , సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జయప్రసాద్ మరియు అక్కడ ఉన్న కానిస్టేబుల్ లకు పలు సూచనలు చేశారు జిల్లా ఎస్పీ. 

పోలింగ్ స్టేషన్ దగ్గరికి పెద్ద మొత్తంలో తరలివచ్చిన అభ్యర్థుల యొక్క మద్దతుదారులకు కూడా సహనంతో శాంతి భద్రతలకు విఘాతంకాలు కాకుండా తమ కార్యక్రమాలు చేసుకోవాలని అలాగే రాత్రి పది తర్వాత ఎవరైనా ప్రచారాలు చేస్తే డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎన్నికలవేళ అసాంఘిక శక్తులు ఏవైనా అనుమానాస్పందంగా మీ పల్లెటూర్లలో తిరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. సైబర్ మోసాల పట్ల ఎన్నికలవేళ అప్రమత్తంగా ఉండాలని ఏవైనా తెలియని వ్యక్తుల నుండి నెంబర్లనుండి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ లింకులు కానీ వస్తే ఓపెన్ చేయొద్దు అని తెలి

పారు. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow