మక్తల్: నేడు ఉదయం మంత్రి వాకిటి శ్రీహరి అనుచరుని చాయి దుకాణం ప్రారంభించారు. వాకిటి మాట్లాడుతూ.. మంత్రిగా ప్రారంభించింది చిన్నదే అయిన ఒకరికి ఉపాధి కల్పించాలన్న తృప్తి ఉందన్నారు. తనను నమ్ముకుని తన చేతి కింద పని చేసిన వారందరికీ ఉపాధి కల్పించడంలో భాగంగా ఎప్పుడు రద్దుగా ఉండే బస్టాండ్ ఏరియాలో నారాయణ పేట ఆర్టీసీడిఎంతో మాట్లాడి.. బస్టాండ్ ముందు నెలవారి కిరాయి బేస్ మీద టీ కొట్టును సాగించేలా అధికారికంగా ఉత్తర్వులు తీసుకుని టీ కొట్టు ఏర్పాటు చేయడానికి ఆర్థిక సాయం చేశారు. రాజకీయంగా వెనుక తిప్పుకుని అవసరం అయిపోగానే గాలికి వదిలేసే ఈ రోజుల్లో అనుచరులకు ఉపాధి చూపించిన మంత్రి మంచితనాన్ని జనాలు మెచ్చుకుంటున్నారు.
Tags
mahabubnagar