యానిమల్(Animal) సినిమాపై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayana) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫిలిం మేకర్స్ కు సమాజం పట్ల భాద్యత ఉండాలని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈమేరకు కామెంట్స్ చేశారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. సినిమాల వల్ల మనుషులు చెడిపోవడం, మారిపోవడం వంటివి జరగదు కానీ.. ఆలోచన విధానం పై ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. సినీ మేకర్స్ కూడా సమాజం పట్ల భాద్యతగా ఉండాలి. మంచి ఆలోచన కలిగేలా చేయకపోయినా పర్వాలేదు కానీ.. కనీసం చెడు ఆలోచనలు కలగకుండా సినిమాలు చేస్తే బాగుటుంది.
కొంతమంది మాత్రం సమాజంలో జరిగే ప్రతీ తప్పుకి సినిమాలే కారణం అనడం కరక్ట్ కాదు. శివ, యానిమల్ వంటి సినిమాలు చూస్తే నాకే ఎదుటవాడిని చంపేయాలి అనే భావన కలుగుతుంది కాబట్టి.. చిన్న పిల్లల్లో ఆ ప్రభావం మరింతగా ఉంటుంది. అలాంటివి దృష్టిలో పెట్టుకొని మేకర్స్ సినిమాలు తెరకెక్కించాలి.. అని చెప్పుకొచ్చారు జయప్రకాశ్ నారాయణ. ప్రస్తుతం జీపీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ వైలెంట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా వచ్చిన ఈ సినిమా కేవలం రెండువారాల్లోనే రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
from V6 Velugu https://ift.tt/bOSB4Pc
via IFTTT