ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్, భారత్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. అయితే పంత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్, భారత్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ 113/5 స్కోర్ చేసింది. అంతకు ముందు టీమిండియా 564/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్(100), శుభ్‌మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగారు. రిషభ్ పంత్(81) త్రుటిలో సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అయితే పంత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంత్ అనగానే.. బ్యాట్‌తో అతడు చేసే విన్యాసాలే గుర్తొస్తాయి. అయితే తొలి రోజు ఆటలో భాగంగా 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ కొట్టిన బంతి డ్రోన్ తాకి, అది కింద పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో నిజమేనా? లేకా ఏఐతో చేశారా? అనే చర్చ మొదలైంది. ‘ఇది నిజం కాదు.. ఫేక్ వీడియో. ఎలా అంటే.. బంతి గమనంలో తేడా ఉంది. అలాగే టెస్టు క్రికెట్‌లో వాడేది రెడ్ బాల్. కానీ ఈ వీడియోలో మాత్రం వైట్ బాల్ కనిపిస్తోంది. ఈ వీడియోను కాస్త పరిశీలనగా చూస్తూ ఇది ఏఐతో తయారు చేసిందని అర్థమవుతోంది’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ‘కొందరు ఏఐతో ఇలాంటి నకిలీ కంటెంట్‌ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఏది నిజమో.. ఏది అబద్ధమూ.. తెలుసుకోవడం కష్టంగా మారింది’ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘పంత్‌కు ఇవన్నీ మామూలే.. కొట్టినా కొట్టేయొచ్చు’ అని పలువురు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. నెట్టింట్ వైరల్ అవుతున్న ఆ వీడియో ఏఐయేనా? నిజంగా జరిగిందా? అనేది స్పష్టంగా తెలియరాలేదు.