జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేయం నిమ్స్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది
ఆందోళన చేపడుతోన్న విద్యార్థి సంఘాలు
ఈ ఘటన విషయాన్ని గమనించిన యూనివర్సిటీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించి విషయాన్ని బయటికి పోకుండా ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మీడియా విద్యార్థి సంఘాలు ఎస్వీకేయం నిమ్స్ యూనివర్సిటీ వద్దకు చేరుకోగా.. యజమాన్యం వారిని యూనివర్సిటీ లోపలికి అనుమతించకుండా సెక్యూరిటీ గార్డ్ తో గేటు వద్దనే ఉంచారు. దీంతో విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. ఇదే యూనివర్సిటీలో గతంలో ఫుడ్ పాయిజన్ ఘటనలో పలువురు విద్యార్థులు చనిపోయిన విషయాన్ని బయటకు రానివ్వలేదని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన తర్వాత కూడా యూనివర్సిటీలోకి ఎవరిని అనుమతించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పూర్తి సమాచారం వెల్లడించాలని పారదర్శక విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జడ్చర్ల పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదని బయట నుంచి అందుకున్న సమాచారం మేరకు యూనివర్సిటీ వద్దకు వెళ్లి విచారణ చేపడుతున్నట్లు పట్టణ సీఐ కమలాకర్ తెలిపారు.