ఇరువర్గాల మధ్య ఘర్షణ.. మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి తీవ్ర గాయాలు


 కొత్తకోట : సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన దాడులలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్‌పల్లి యాదవ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గొడవ జరిగే సమయంలో కొందరు వ్యక్తులు ఇండ్లపై నుండి రాళ్లు విసరడంతో బీచుపల్లి యాదవ్ తలకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల నేపథ్యంలో దాడులు జరిగాయా..!? లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా..? అన్న అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గ్రామంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow