భర్తను నదిలోకి తోసిన భార్య.. కేసులో ఊహించని ట్విస్ట్‌! భర్తపైనే ఎఫ్‌ఐఆర్‌..? ఎందుకంటే..


 

సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసిన భార్య.. కేసులో ఊహించని ట్విస్ట్‌! భర్తపైనే ఎఫ్‌ఐఆర్‌..? ఎందుకంటే..

సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను నదిలోకి నెట్టిన ఘటన వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ, భర్త తాతప్ప తన భార్య గడ్డెమ్మపై బాల్య వివాహం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. గడ్డెమ్మ మైనర్ అని పాఠశాల రికార్డులు నిర్ధారించాయి. పోలీసులు తాతప్పకు పత్రాలు సమర్పించాలని గడువు విధించారు. సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను తన భార్య వంతెనపై నుంచి నీటిలో తోసేసిన వార్త ఎంత వైరల్‌ అయిందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. భర్త తాతప్ప తన భార్య తనను నదిలోకి తోసి చంపడానికి ప్రయత్నించిందని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ సంఘటన తర్వాత తాతప్ప తన భార్య గడ్డెమ్మకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తన భార్య తనను నదిలోకి తోసి చంపడానికి ప్రయత్నించిందని ఆరోపించిన తాతప్పపై నిజానికి ఆమెను బాల్య వివాహం చేసుకున్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. తాతప్ప మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో తన భార్య గడ్డెమ్మ వయస్సును నిరూపించే పత్రాన్ని అందించాలని భర్త తాతప్పకు పోలీసులు గడువు విధించారు.

యాద్గిర్ జిల్లా మహిళా రక్షణ అధికారి వివాహ సమయంలో గడ్డెమ్మ వయసు 15 సంవత్సరాల 8 నెలలుగా నిర్ధారించారు. పాఠశాల రికార్డుల ప్రకారం తాతప్ప భార్య గడ్డెమ్మ మైనర్ అని నిర్ధారణ అయింది. ఈ విషయంలో రాయచూర్ తాలూకాలోని దేవసుగూర్ నివాసి తాతప్పపై తగిన చర్యలు తీసుకోవాలని రాయచూర్ జిల్లా బాలల రక్షణ అధికారికి లేఖ రాశారు. యాద్గిర్ జిల్లా బాలల సంరక్షణ విభాగానికి లేఖ చేరిన వెంటనే అప్రమత్తమైన రాయచూర్ జిల్లా బాలల సంరక్షణ అధికారి తాతప్ప ఇంటికి వెళ్లి పరిశీలించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి, CDPO, గ్రామ పంచాయతీ సిబ్బంది తాతప్ప కుటుంబ సభ్యుల నుండి వివాహం గురించి సమాచారాన్ని సేకరించారు. అయితే తాతప్ప తన భార్య, అత్తమామల గురించి ఎటువంటి పత్రాలను అందించకుండా మౌఖిక సమాచారం మాత్రమే ఇచ్చారు. రేపు (జూలై 21) లోపు సరైన పత్రాలు అందించకుంటే బాల్య వివాహ చట్టం కింద భర్త తాతప్ప, అతని కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.
Previous Post Next Post

نموذج الاتصال