Kavitha:బీఆర్ఎస్ పార్టిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. అలాగే తనపై మల్లన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అన్నపై జంక్ సైరన్..?
ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అన్నాచెల్లాల మధ్య గ్యాప్ రావడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికి ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. కవితకు షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇంఛార్జ్‌గా ఉన్న కవిత ప్లేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించారు. కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం గులాబీ పార్టీలో, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కవితకు ఆ పార్టీలో, అనుబంధ సంఘాల్లోనూ ప్రాధాన్యం తగ్గుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ పార్టీపై చేసిన ఆరోపణలతో ఆ పార్టీకి, ఆమెకు దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. అన్నపై ఉన్న కోపంతో కవిత ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.