జూబ్లీహిల్స్‌ MLA మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత.. నేతల సంతాపం

 Maganti Gopinath Passed Away: జూబ్లీహిల్స్‌ MLA మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత.. నేతల సంతాపం

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) ఆదివారం (జూన్‌ 8) ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం

హైదరాబాద్‌, జూన్‌ 8: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) ఆదివారం (జూన్‌ 8) ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. జూన్‌ 5వ తేదీన ఆయన నివాసంలో గుండెపోటు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గత 3 రోజులుగా ఆయన ఏఐజీలో గుండె సంబంధిత సమస్యలతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. తొలుత కార్డియాక్‌ అరెస్టుకు గురైనట్లు గుర్తించిన వైద్యులు సీపీఆర్‌ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిచారు. పైగా ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా ఉంది. ఈ క్రమంలో 3 నెలల క్రితం కూడా ఏఐజీలో చేరి డయాలసిస్‌ చేయించుకున్నారు. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు...

Previous Post Next Post

نموذج الاتصال