#Jclnews:
వృక్షో రక్షితో రక్షితః ఇది శాస్త్రాల మనకు చెప్తున్నాయి దీని అర్థం వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.
ఇద్దరు కొడుకులు ఉన్న తండ్రి కొడుకులని చదివించి పెంచి పెద్దగా చేసి ఉద్యోగస్తులను చేశాక వాళ్లు తల్లిదండ్రులకు తోడుకుంటారు లేదో తెలియదు కానీ కొడుకులతో పాటు రెండు చెట్లను పెంచితే తప్పకుండా వృద్ధాప్యంలో చెట్లు అతనికి తోడుంటాయి.
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మానవాళి ఎండాకాలంలో కూలర్లో నీళ్ళు పోయడానికి ఇష్టపడతాడు కానీ వర్షాకాలంలో నాలుగు చెట్లు పెంచి పెద్దవి చేయడానికి ఇష్టపడడు.
ఒక మొక్క నాటి మొక్కకు మూడేళ్ల దాకా మనం పోషిస్తే వందేళ్లు బ్రతుకుతుంది తర్వాత పోషించాల్సిన అవసరం లేదు.
ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోవడంతో మొక్కలను తొందరగా పెంచే వీలున్న మొక్కల వైపు అందరు చూపు వెళుతుంది.
ఈ సందర్భంగానే దేశాలు దాటి భారతదేశంలోకి వచ్చిన రాక్షసి చెట్టి కోనో కార్పస్ ఇప్పుడు ఇది ప్రపంచాన్నే కాదు భారతదేశాన్ని కూడా బెదిరిస్తుంది అధికారుల పాలకుల అనాలోచిత చర్యల వల్ల నేడు చెట్ల వల్ల కాలుష్యం తగ్గేది పోయి ఈ కోణం కార్పోస్ చెట్టు పెంచడం వల్ల , కాలుష్యం పదింతలైతుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు ఏడు కోట్ల వరకు కొనవకార్ప చెట్లు ఉన్నట్లు అంచనా. చెట్లు నరకడం పైన కోన కార్పస్ చెట్ల వల్ల వచ్చే నష్టాల పైన జడ్చర్ల డిగ్రీ కాలేజ్ వృక్షశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ సదాశివయ్యతో ఇంటర్వ్యూ
Jclnews: ఏడు కోట్ల రాక్షసి చెట్లు!
ప్రభుత్వాలు చెట్లు పెట్టిస్తున్నాయి విద్యుత్ అధికారులు చెట్లు నరికేస్తున్నారు.
ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు.
చెట్లు నాటడానికి ఖర్చు అవుతుంది చెట్లు పెంచడానికి ఖర్చు అవుతుంది చివరికి చెట్లు నరికించడానికి ఖర్చు ఐతుంది ఈ ఖర్చునంత భరిస్తుంది సామాన్య మానవుడే టాక్స్ పేయర్ అంటాం మనం
#Jclnews: చెట్లు పెంచిన ప్రభుత్వమే చెట్లు నరికిస్తుంది.
ఇది నిజం మేలుకోకపోతే ముప్పు తప్పదు