ఎట్టకేలకు బాలానగర్ ముఖ్య కూడలిలో ఫై ఓవర్ బ్రిడ్జి మంజూరు...

 ఎట్టకేలకు బాలానగర్ ముఖ్య కూడలిలో ఫై ఓవర్ బ్రిడ్జి మంజూరు...



బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. 


బాలానగర్ ముఖ్య కూడలిలో పలుమార్లు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయి.. అలాగే సంత రోజు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడంతో వంతెన మంజూరు అయినట్టు తెలుస్తోంది. 


ప్రస్తుతం రెండు రోజులుగా జాతీయ రహదారిపై భూమి గట్టితనాన్ని మిషన్ ద్వారా పరిశీలిస్తున్నారు.


ఇప్పటివరకు 15 పీట్ల లోతు వరకు గట్టితనాన్ని పరిశీలించినట్టు సమాచారం.


బాలానగర్ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణం చేపడుతుండడంతో మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


అలాగే ప్రమాదకరంగా ఉన్న ముదిరెడ్డిపల్లి, రాజాపూర్ ముఖ్య కూడలి లోని జాతీయ రహదారిపై కూడా వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని రాజపూర్ మండల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow