ఎన్నికలవేళ రాముడితో రాజకీయాలు షురూ..
వివాదం అవుతున్న చల్ల వంశి చందర్ రెడ్డి బ్యానర్
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసర్లాబాద్ గ్రామ పంచాయతీలో ఉన్న గుడికి ఇరువైపులా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి బ్యానర్లు వివాదం అవుతున్నాయి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రేపు రాముల వారి కళ్యాణం కూడా ఉండడంతో గుడి లోపల బ్యానర్లు కట్టడాన్ని గ్రామ ప్రజలు తప్పుపడుతున్నారు.
మామూలు సమయమైతే ఎవరూ పట్టించుకునే వారు కాదేమో కానీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేపు శ్రీరామనవమి కవడంతో ఇప్పుడు గుడిలో చల్లా వంశీచందర్ రెడ్డి బ్యానర్లు ప్రత్యక్షం కావడం వెనక గ్రామంలో వివాదాలు గొడవలు అయ్యే అవకాశం ఉంది అంటూ పలువురు వాపోతున్నారు.
దేవాలయాలలో ఇలాంటి బ్యానర్లు ఉండకుండా చూడాలని పలువురు కోరుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మేలుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని నసర్లబాద్ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
